నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా దసరా (Dasara). దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల తొలి సినిమా ఇదే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్న దసరా యూనిట్ ఎప్పటికప్పుడు సినిమా ఆసక్తి పెంచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అమ్మలాలో అమ్మలాలో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో మెలోడియస్ ట్యూన్ బాగా ఆకట్టుకుంటోంది. చిన్నతనం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. రెహమాన్ రచించిన ఈ పాటలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన తీరు స్పెషల్ అట్రాక్షన్ అయింది.
గతంలో వదిలిన దసరా టీజర్, ట్రైలర్ లో నాని విశ్వరూపం కనిపించింది. చిత్రంలోని ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ దసరా మూవీని మార్చి 30వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో నాని కనిపించనుండటం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. రా అండ్ రగ్గ్‌డ్ లుక్ లో నాని కనిపించబోతున్నారు.
తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ దసరా మూవీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ మూవీ విడుదల కోసం నాని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. నాని కెరీర్ లో రాబోయే తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం మరో విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthi Suresh