Vijay- Pooja Hegde: కోలీవుడ్ తలపతి విజయ్ హీరోగా డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే ఖరారైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. పూజా హెగ్డేను తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తలపతి 65వ టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో తొమ్మిదేళ్ల తరువాత తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది పూజా హెగ్డే.
కాగా మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూజా హెగ్డే, తమిళ్లో మూగమూడి అనే మూవీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. జీవా హీరోగా నటించిన ఈ చిత్రం 2012లో విడుదల అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయాన్ని సాధించకపోగా.. పూజాకు వెంటనే అవకాశాలు రాలేదు. ఇక ఒక లైలా కోసం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు టాప్ హీరోయిన్గా ఎదిగారు. మధ్య మధ్యలో హిందీ సినిమాల్లోనూ నటించిన పూజా.. ఇప్పుడు ఇటు తెలుగు, అటు హిందీలో బిజీగా మారారు.
The gorgeous @hegdepooja onboard as the female lead of #Thalapathy65 !@actorvijay @Nelsondilpkumar @anirudhofficial#Thalapathy65bySunPictures #PoojaHegdeInThalapathy65 pic.twitter.com/flp4izppAk
— Sun Pictures (@sunpictures) March 24, 2021
ఇక ప్రస్తుతం ఈ నటి తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నటిస్తున్నారు. అలాగే ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన పూజా నటిస్తోంది. వీటితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్ సరసన సర్కస్‌లో బుట్టబొమ్మ నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్‌లను పూజా వింటున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Vijay