హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya-Khiladi: మ‌రో ఛాన్స్ కొట్టేసిన అన‌సూయ‌.. ర‌వితేజ ఖిలాడిలో హాట్ యాంక‌ర్.. ఏ పాత్రనో తెలుసా

Anasuya-Khiladi: మ‌రో ఛాన్స్ కొట్టేసిన అన‌సూయ‌.. ర‌వితేజ ఖిలాడిలో హాట్ యాంక‌ర్.. ఏ పాత్రనో తెలుసా

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj/Instagram)

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj/Instagram)

Anasuya-Khiladi: బుల్లితెర‌పైన హాట్ యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే.. వెండితెర‌పై వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు అన‌సూయ‌. చిన్న‌, పెద్ద పాత్ర అన్న‌ది ప‌ట్టించుకోకుండా సినిమాల్లో వైవిధ్య‌ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్నారు అన‌సూయ. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో న‌టించిన ఈ యాంక‌ర్‌కి ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది.

ఇంకా చదవండి ...

  Anasuya-Khiladi:  బుల్లితెర‌పైన హాట్ యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే.. వెండితెర‌పై వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు అన‌సూయ‌. చిన్న‌, పెద్ద పాత్ర అన్న‌ది ప‌ట్టించుకోకుండా సినిమాల్లో వైవిధ్య‌ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్నారు అన‌సూయ. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో న‌టించిన ఈ యాంక‌ర్‌కి ఇప్పుడు మ‌రో బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. ఈ ఏడాది క్రాక్ విజ‌యంంతో మంచి ఊపు మీదున్న మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తోన్న ఖిలాడిలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది అన‌సూయ‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఖిలాడి టీమ్‌కి అన‌సూయ‌కు స్వాగ‌తం చెబుతున్న‌ట్లు ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అంతేకాదు ఈ మూవీకి గేమ్ ఛేంజ‌ర్ అన‌సూయ అని ద‌ర్శ‌కుడు కామెంట్ పెట్టారు. చూస్తుంటే అన‌సూయ ఈ మూవీలో విల‌న్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  కాగా థ్రిల్ల‌ర్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఖిలాడికి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రవితేజ ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తున్నారు. ఆయ‌న స‌రస‌న డింపుల్ హ‌య‌తీ, మీనాక్షి చౌద‌రీ రొమాన్స్ చేస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్, మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. పెన్ స్టూడియోస్, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  మ‌రోవైపు అన‌సూయ థ్యాంక్యు బ్ర‌ద‌ర్ అనే చిత్రంలో న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న రంగ మార్తండ‌లోనూ అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇందులో అన‌సూయ దేవ‌దాసి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

  Published by:Manjula S
  First published:

  Tags: Anasuya, Anasuya Bharadwaj, Ravi Teja

  ఉత్తమ కథలు