ఆఫీసర్ పోయాడు... నాగ్ వేదాంతం అందుకున్నాడు

ఎన్నో ఆశలూ, అంచనాలూ పెట్టుకుని తీసిన సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా పరాజయం చెందుతుంటాయి. కొందరు హీరోలు నమ్మి చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. మహేష్ బాబు లాంటి సున్నిత మనస్కులు అయితే ఒక్క గట్టి ఫ్లాప్ తగిలితే చాలు... బ్రేక్ తీసుకుని విదేశాలకి వెళ్లి గడుపుతుంటాడు. బాలయ్యబాబు లాంటి హీరోలయితే బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతారు. కింగ్ నాగార్జున పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది.

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:18 PM IST
ఆఫీసర్ పోయాడు... నాగ్ వేదాంతం అందుకున్నాడు
Nagarjuna in ‘officer’ movie
  • News18
  • Last Updated: June 6, 2019, 2:18 PM IST
  • Share this:
ఎన్నో ఆశలూ, అంచనాలూ పెట్టుకుని తీసిన సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా పరాజయం చెందుతుంటాయి. కొందరు హీరోలు నమ్మి చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. మహేష్ బాబు లాంటి సున్నిత మనస్కులు అయితే ఒక్క గట్టి ఫ్లాప్ తగిలితే చాలు... బ్రేక్ తీసుకుని విదేశాలకి వెళ్లి గడుపుతుంటాడు. బాలయ్యబాబు లాంటి హీరోలయితే బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతారు. కింగ్ నాగార్జున పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది.

ఈ మధ్య కొద్దికాలంగా సెలక్టివ్ గా కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. ‘భాయ్’ సినిమా ఫలితం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అలాగే నాగ్... 25 ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘ఆఫీసర్’ సినిమా చేశాడు. గత శుక్రవారం విడుదలయిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా రొంటకొట్టుడు ఫార్ములాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఫూల్స్ చేస్తున్న ఆర్జీవీ... మరోసారి నాగ్ సినిమాతో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. వర్మ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు మొదటినుంచి ‘ఆఫీసర్’ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. నాగ్ అభిమానుల్లో మాత్రం ‘శివ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందోమోననే కొన్ని ఆశలుండేవి. కానీ వాటిని అడియాసలు చేసేశాడు ఆర్జీవీ.

‘ఆఫీసర్’ సినిమా డిజాస్టర్ కావడంతో భారీ రేటు పెట్టి కొన్న బయ్యర్లు బోరుమంటున్నారు. రాజమండ్రికి చెందిన ఒక బయ్యర్ ఫ్యాన్సీ రేటు చెల్లింది ‘ఆఫీసర్’ సినిమా ఆంధ్ర హక్కులను కొన్నాడు. నాగ్ గత చిత్రం ‘రాజుగారి గది 2’ హక్కులను కూడా ఈయనే కొన్నాడు. అప్పుడు రెట్టింపు లాభం వచ్చింది. దాంతో సాహసం చేసి మరీ వర్మ కొత్త చిత్రాన్ని కొన్నాడు. అయితే పెట్టిన రేటులో 40 శాతం కూడా ‘ఆఫీసర్’ తిరిగి తెచ్చేలా కనిపించడం లేదు. దాంతో ‘నిర్మాతలూ, నాగ్ ఆదుకోకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం...’ అంటూ వాపోతున్నారు ఆ బయ్యర్.

అయితే నాగ్ మాత్రం ‘ఆఫీసర్’ చిత్ర పరాజయం గురించి వేదాంతం రూపంలో చెబుతూ ట్వీట్ చేశాడు.
‘‘గెలుపు అంతిమం కాదు, ఓటమి భయానకం కాదు. ఏం జరిగినా ముందుకు సాగడమే మనిషి నైజమని విన్ స్టన్ చర్చిల్ చెప్పారు. వారం గడిచిపోయి మళ్లీ సోమవారం వచ్చింది. అందరికీ గుడ్ మార్నింగ్...’’ అంటూ పోస్ట్ చేశాడు నాగ్.దీన్ని చూస్తుంటే ‘ఆఫీసర్’ సినిమా ఫలితం టాలీవుడ్ మన్మథుడిని కూసింత బాధపెట్టినట్టే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లలో ‘ఈ సినిమా సక్సెస్ కాకపోతే తన్నమని వర్మ చెప్పాడు... నేను కచ్చితంగా అలాగే చేస్తా...’ అన్నాడు నాగ్. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. నాగ్, వర్మని తన్నాడో లేదో... తంతే మాత్రం బయ్యర్లకి డబ్బులు వస్తాయా...
Published by: Ramu Chinthakindhi
First published: June 4, 2018, 9:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading