Home /News /movies /

ODIA TV ACTRESS RASHMI REKHA COMMITS SUICIDE SB

Suicie: టీవీ నటి రష్మీ ఆత్మహత్య... సహజీవనమే కారణమంటున్న తండ్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అయితే రష్మీ గత కొన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉంటుంది. అందులో సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆత్మహత్యకు అదే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    వరుస విషాదాలు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల బెంగాల్ రాష్ట్రంలో అనేకమంది నటీనటులు, మోడల్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మరో టీవీ నటి అఘాయిత్యానికి పాల్పడింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్‌ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

    గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని అందించిన సమాచారంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రష్మీ  ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా ‘ఐ లవ్‌ యూ సాన్’ అని రాసుకొచ్చింది. రష్మీ వయసు.. 23 ఏళ్లు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ ‘కెమిటి కహిబి కహా’ అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.



    అయితే రష్మీ రేఖ గత కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రష్మీ తండ్రి కూడా తన కూతురు మరణానికి ఆమె సహజీవనం చేసిన సంతోష్‌ అనే వ్యక్తే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. ‘శనివారం (జూన్‌ 18) రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదన్నారు రష్మీ తండ్రి.
    >
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Suicide, Tv actress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు