Home /News /movies /

NUSRAT BHARUCHA SELL CONDOMS IN FILM JANHIT MEIN NETIZENS TROLLING BOLLYWOOD SB

పబ్లిక్‌గా కండోమ్స్ అమ్ముతున్న హీరోయిన్...బాలీవుడ్ ఇలా దిగజారిపోయిందన్న నెటిజన్స్

కండోమ్స్ అమ్ముతున్న హీరోయిన్

కండోమ్స్ అమ్ముతున్న హీరోయిన్

హీరోయిన్ పెట్టిన పోస్టర్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందని కొందరు నెటిజన్స్ పోస్టు పెడితే.. బాలీవుడ్ ఈ స్థాయికి దిగజారిపోయిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

    కండోమ్.. ఈ పదం పబ్లిక్ చెప్పాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎవరైనా దాని గురించి మాట్లాడిన వినడానికి కూడా కొందరు కాస్త అన్ ఈజీగా ఫీల్ అవుతారు. అలాంటిది... పబ్లిక్‌గా నడిరోడ్డుపై కండోమ్ గురించి మాట్లాడితే..వారిని అయితే ఏదో పెద్ద తప్పు చేసినవాళ్ల కింద లెక్క కడతారు. అయితే ఇలాంటి పని ఓ సెలబ్రిటీ చేస్తే.. అది మరింత హాట్ న్యూస్ అవుతుంది. తాజాగా ఓ హీరోయిన్ నడిరోడ్డుపై తిరుగుతూ.. కండోమ్స్ గురించి చెబుతుంది.

    తాజాగా సిని ఇండస్ట్రీలో రకరకాల కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో కథలు వస్తున్నాయి... గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ శానిటరీ న్యాప్ కీన్స్‌పై సినిమా తీసిన విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో కండోమ్ టెస్టర్ గా కనిపిస్తున్న విషయం కూడా మనకు తెలుసు.  తాజాగా బాలీవుడ్ మరో హీరోయిన్ నుష్రత్ బరుచా కూడా కండోమ్ కు సంబంధించిన కథతో రెడీ అయిపోయింది. నుష్రత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘జన్ హిత్ మే జారీ’.  జై బసంతు సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.



    అయితే ఈ సినిమా కండోమ్ గురించి తీసినది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఒక అమ్మాయి తన పట్టణంలో వీధి వీధి తిరుగుతూ  కండోమ్ లు అమ్ముతూ జీవనం సాగిస్తుంది.  అయితే ఒక యువతి ఆలా కండోమ్స్ అమ్మడాన్ని తప్పుగా భావించి ఆమె , ఆమె కుటుంబం  సామాజిక నిషేధానికి గురవుతారు. సామాజిక నిషేధం కారణంగా ఆ యువతి ఎదుర్కొనే అనేక సవాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే కథ బాగానే ఉన్నా బయట కూడా ఈ పాత్ర చేస్తున్నందుకు  నుష్రత్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్.

    అయితే  ఆమె మాత్రం అలాంటి  కామెంట్స్ కు తాను భయపడబోనని, ఇటువంటి టాపిక్ పై సినిమా తీయడానికి ధైర్యం కావాలని చెబుతోంది. అది తనకు ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొత్త కొత్త ఆలోచలనలతో సినిమాలు చేస్తున్నారు. ఆడియ‌న్స్‌కు కూడా అంతుచిక్కని కథలతో డైరెక్టర్లు వస్తున్నారు. దీంతో ఎలాంటి సినిమాలు చేయడానికి అయినా... ఇటు హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఆలియా భట్.. గంగూభాయి కతియావాడిలో వేశ్యపాత్రలో కనిపించింది. ఆ సినిమా కూడా ఆలియాకు మంచి పేరు తెచ్చింది. ఇక హీరోయిన్స్ కూడా  ఎలాంటి  ఛాలెంజింగ్ పాత్రలకైనా సై అంటున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bollywood, Bollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు