నా డ్రెస్ నా ఇష్టం..విమర్శలు లెక్కచేయనంటున్న బాలీవుడ్ బ్యూటీ

Nushrat Bharucha: తన డ్రెస్ ఎబ్బెట్టుగా ఉందన్న నెటిజన్ల విమర్శలను బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ కొట్టిపారేసింది. అభిప్రాయాన్ని చెప్పేందుకు వారికి ఎలా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో...అలాగే తనకు నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు తనకు ఉందని వ్యాఖ్యానించింది.

news18-telugu
Updated: February 11, 2020, 3:52 PM IST
నా డ్రెస్ నా ఇష్టం..విమర్శలు లెక్కచేయనంటున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా
  • Share this:
బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ భరూచా 2010లో వచ్చిన ‘తాజ్ మహల్’ చిత్రంతో శివాజీ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమయ్యింది. బాలీవుడ్‌లో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా', 'సోనూ కే టిటూ కే స్వీటీ' తదితర సినిమాల్లో నటించింది. మీటూ ఉద్యమ నేపథ్యంలో దర్శకుడు లవ్ రంజన్‌ తనను వేధించాడని ఓ మహిళ ఆరోపించగా...లవ్ రంజన్ సార్ చాలా మంచోడంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది నుష్రత్. సెల్ఫీ కోసమంటూ ఓ అభిమాని దగ్గరకు వచ్చి తన నడుము మీద చేయివేసాడని మండిపడి మొన్న ఆ మధ్య వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. తరచూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు షేర్ చేస్తూ బోలెడంత ఫేమ్ సాధించింది నుష్రత్.


ఇక నేరుగా విషయానికొస్తే ఇటీవల ఓ ఈవెంట్‌లో నుష్రత్ వేసుకున్న ఫోటోలు సెగలు పుట్టించాయి. నడుము పై వరకు స్కిన్ షో చేస్తున్న ఈ బోల్డ్ ఫోటోలను స్వయంగా ఆమె  సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. దీనిపై ధీటుగా సమాధానమిచ్చిన నుష్రత్..తన డ్రెస్‌పై ఇతరుల అభిప్రాయాలను తాను లెక్కచేయబోనని వ్యాఖ్యానించింది. దేశంలో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని..తన డ్రెస్‌పై అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొంది. అయితే తన డ్రెస్ విషయంలో ఇతరుల కామెంట్స్‌ను తాను పట్టించుకోనని వ్యాఖ్యానించింది. తనకు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇబ్బంది అనిమిప్తే మరోసారి వేసుకోనని పేర్కొంది.


 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Bringing sexy back ! 💁‍♀️ #AmazonFilmfareAwards Outfit @yousef__akbar Handcuff @suhanipittie Earcuff @misho_designs Shoes @publicdesire Styled by @chandanizatakia Make up @tanvismarathe Hair @sumankaloya Photos @shivamguptaphotography


nushrat (@nushratbharucha) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు