#NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..

రోజుకో కొత్త ప్రోమోతో సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘క‌థానాయ‌కుడు’ విడుద‌ల కానుంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన మ‌రో ప్రోమో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 6, 2019, 3:55 PM IST
#NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..
ఎన్టీఆర్ ఏఎన్నార్
  • Share this:
రోజుకో కొత్త ప్రోమోతో సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘క‌థానాయ‌కుడు’ విడుద‌ల కానుంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన మ‌రో ప్రోమో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో తెలుగు వాళ్ల గురించి.. ప్ర‌త్యేక రాష్ట్రం గురించి ఎన్టీఆర్ పోరాడిన తీరు చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాని నాగేశ్వ‌ర‌రావ్ విజువ‌ల్ కూడా ఇప్పుడు వ‌చ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ క‌లిసి ఓ పార్టీలో ఉండ‌టం.. అక్క‌డ తెలుగు వాళ్లంటూ లేరు.. అంతా సౌత్ ఇండియ‌న్ మ‌ద్రాసీలే క‌దా అని ఎవ‌రో అన‌డం.. దాన్ని ఎన్టీఆర్ కాద‌న‌డం అంతా ఉన్నాయి.



మాకు కూడా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంది.. తెలుగు వాళ్ల‌కు గుర్తింపు కావాల‌నే డైలాగ్ ఉంది. ఇక హైద‌రాబాద్‌కు షిఫ్ట్ కావ‌చ్చు క‌దా.. ఇలాంటి మాట‌లు విన‌కూడ‌ద‌నే తాను హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని.. నువ్వు కూడా రావ‌చ్చు క‌దా అని ఏఎన్నార్ అడిగితే ఇది ఇండ‌స్ట్రీ స‌మ‌స్య కాదు.. తెలుగు వాడి వేడి దేశ‌మంతా తెలియాలి అంటూ ఎన్టీఆర్ చెప్తాడు. ఈ ప్రోమోతో ఆస‌క్తి మ‌రింత‌గా పెరిగిపోయింది. ఇలాంటి సీన్స్ ఇంకా సినిమాలో ఎన్ని ఉన్నాయో అని ఆస‌క్తిగా చూస్తున్నారు అన్న‌గారి అభిమానులు.

స్వరభాస్కర్ హాట్ ఫోటోస్..




ఇవి కూడా చదవండి..

‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..

ప్ర‌జారాజ్యం ఫ్లాప్.. జనసేనతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రివేంజ్ డ్రామా..


వావ్ హౌ రొమాంటిక్.. వ‌ర్మ బుగ్గ గిల్లిన త్రిష‌..

First published: January 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>