#NTRBiopic: ఆడియో వేడుకలో అన్నగారి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్..
ఎవరి బాకీ ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అంటారు. అందుకే ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడిప్పుడు. బాబాయ్ బాలయ్యకు బాకీ పడిందిప్పుడు తీర్చేస్తున్నాడు. వీలైనంత త్వరగా బాబాయ్ ఇచ్చింది తిరిగిచ్చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. అందులో భాగంగానే ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు బాలయ్య వస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వెళ్లనున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్
- News18 Telugu
- Last Updated: December 20, 2018, 6:45 PM IST
అన్నగారి సినిమా అంటేనే నందమూరి కుటుంబానికి పండగ. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుంది అన్న రోజు నుంచి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఈ చిత్రం కోసం. ఇక క్రిష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు అన్నగారి ఆడియో వేడుకకు కుటుంబం అంతా కలిసి వస్తున్నారు. నందమూరి తారకరాముడి సినిమా ఆడియో వేడుకను అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సహా.. నందమూరి కుటుంబం అంతా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రావడం అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు బాబాయ్ అరవింద సమేత వేడుకకు వచ్చినపుడు ఇప్పుడు అబ్బాయి కూడా వెళ్ళాలి కదా.. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల వేడుకకు వస్తున్నాడు. డిసెంబర్ 21న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ఇక్కడే ఆడియోతో పాటు ట్రైలర్ లాంచ్ కూడా జరగనుంది. ఇదే వేడుకలో నాటి ఎన్టీఆర్ సహచర నటులు కూడా హాజరు కానున్నారు.
ఎన్టీఆర్ ఆడియో వేడుకకు రెబల్ స్టార్ కృష్ణంరాజు.. సూపర్ స్టార్ కృష్ణ.. నాటి లెజెండరీ నటి, ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన జమున.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. గీతాంజలితో పాటు ఇంకా చాలా మంది అతిథులు రానున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం అంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపించబోతుంది. ఇదే ఇప్పుడు అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తుంది. పైగా ఈ వేడుకను కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రంలో ఒక్కరో ఇద్దరో కాదు.. పదుల సంఖ్యలో నటులు ఉన్నారు. రానా, కళ్యాణ్ రామ్, రకుల్,పాయల్ రాజ్‌పుత్, హన్సిక, ప్రకాశ్ రాజ్, కైకాల సత్యనారాయణ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత నందమూరి హీరోలంతా కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారన్నమాట. అప్పుడు సావిత్రి బయోపిక్ మహానటి ఆడియో వేడుకలో ఆమె కుటుంబం అంతా కలిసి వచ్చినట్లు ఇప్పుడు ఎన్టీఆర్ ఆడియో వేడుకకు అంతా కలిసి వస్తున్నారు. మరి ఈ వేడుక ఎలా జరగబోతుందో చూడాలిక.ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ బాలకృష్ణ

రావణ బ్రహ్మగా ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)
సీఎం జగన్‌కు ఫేవరెట్ హీరో బాలయ్య సలహా...
జగన్‌కు కౌంటర్ ఇవ్వాలంటే బాలయ్యే కరెక్ట్... బీజేపీ నేత
బాలయ్య మామా ... రూలర్ సినిమా దుమ్ము లేపిద్దంటున్న నారా లోకేష్
Ruler Pre Release | బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్...
బాలకృష్ణ రూలర్ ప్రభంజనం.. ‘అడుగడుగో యాక్షన్ హీరో’..
బాలకృష్ణను సవాల్ చేయనున్న ఎమ్మెల్యే రోజా..
ఎన్టీఆర్ ఆడియో వేడుకకు రెబల్ స్టార్ కృష్ణంరాజు.. సూపర్ స్టార్ కృష్ణ.. నాటి లెజెండరీ నటి, ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన జమున.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. గీతాంజలితో పాటు ఇంకా చాలా మంది అతిథులు రానున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం అంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపించబోతుంది. ఇదే ఇప్పుడు అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తుంది. పైగా ఈ వేడుకను కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్, హరికృష్ణ పాత్రల్లో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ (ట్విట్టర్ ఫోటో)