NTR 30 | Koratala Siva : ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఓ సినిమా (NTR30) రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా అంత త్వరగా సెట్స్ పైకి వెళ్లకపోవచ్చని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథల పట్ల, సన్ని వేశాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే పక్కాగా అన్ని కుదిరాకే సెట్స్ పైకి వెళ్లాలనీ భావిస్తోందట టీమ్. ఈ క్రమంలో ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.
ఇక మొన్నటి వరకు ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్‌గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది.దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిశీలిస్తున్నారట టీమ్. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు (Anirudh Ravichander) అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.
Excited and pumped for #NTR30 with my brother @tarak9999 in a #KoratalaSiva directorial 🥳🥳🥳
Let the fireworks begin💥💥💥#HappyBirthdayNTR@NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/7OYBI5vl0G
— Anirudh Ravichander (@anirudhofficial) May 19, 2022
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు (Prashanth Neel) ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Koratala siva, NTR, NTR30, Tollywood news