Home /News /movies /

NTR 30: ఎన్టీఆర్ 30వ సినిమాపై ఈ రోజే బిగ్ సర్ప్రైజ్.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్..

NTR 30: ఎన్టీఆర్ 30వ సినిమాపై ఈ రోజే బిగ్ సర్ప్రైజ్.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్..

ఎన్టీఆర్ Photo : Twitter

ఎన్టీఆర్ Photo : Twitter

NTR 30: ఎన్టీఆర్ 30వ సినిమాపై ఈ రోజే బిగ్ సర్ప్రైజ్.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే..

    NTR 30: ఎన్టీఆర్ 30వ సినిమాపై ఈ రోజే బిగ్ సర్ప్రైజ్.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్.. ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గొండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడు. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌కు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నాడు. ముగ్గురు మాస్ హీరోలతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయనున్నాడు. ఈ  సినిమాపై పూటకో రూమర్ వినబడుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.


    RRR సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను చేయాలి. ఎపుడు ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఉగాది కానుకగా  ఈరోజు రాత్రి 7 గంటల 2 నిమిషాలకు రివీల్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలే హస్తిన’కు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదే టైటిల్ కన్ఫామ్ చేస్తారో వేరేది పెడతారో చూడాలి. ఈ సినిమాను పూర్తి పొలిటికల్ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కించననున్నట్టు సమాచారం. ఈ సినిమాను నార్త్ ఇండియా పొలిటికల్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్  చేసాడు. ఈ సినిమాలో సంజయ్ దత్, ఉపేంద్ర, విజయ్ సేతుపతిలు పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ ముగ్గురు విలన్‌లను రాజకీయంగా ఎన్టీఆర్ ఎదుర్కొన్నాడనేదే ఈ  సినిమా స్టోరీ అని చెబుతున్నారు. మొత్తంగా ఈ రోజు సాయంత్రి ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, RRR, Tollywood, Trivikram

    తదుపరి వార్తలు