Home /News /movies /

NTR WILL ACT NEGATIVE SHADES IN PRASHANTH NEEL MOVIE SB

Ntr: నెగటివ్ షేడ్స్‌లో ఎన్టీఆర్.. విలన్‌గా కనిపంచనున్న తారక్..!

ఎన్టీఆర్ 31 పోస్టర్ రిలీజ్

ఎన్టీఆర్ 31 పోస్టర్ రిలీజ్

గతంలో జై లవ కుశ సినిమాలో కూడా విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు తారక్. ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) దూకుడు మీదున్నడు. ఆర్ఆర్ఆర్(RRR) సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం యన్టీఆర్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. కొరటాల శివతో ఎప్పుడో కమిట్ అయినా NTR30 ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమా మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ముందుగా వినిపించినట్టుగానే ‘అసురుడు’ అనే పేరునే ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

    అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే అసురుడు (Asurudu) అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా ‘అసుర’ లేక ‘అసురుడు’ అని వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అసురుడు అనే టైటిల్‌ను ప్రశాంత్ నీల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. ఆయన తెరకెక్కించిన ‘ఉగ్రం’, ‘కెజిఎఫ్’, ‘సలార్’.. ఇప్పుడు ‘అసుర’.. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి యాప్ట్ గా సరిపోయినట్లు కనిపిస్తుంది అంటున్నారు పలువురు ఎన్టీఆర్ అభామానులు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారు.



    మరోవైపు ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో జై లవ కుశ సినిమాలో కూడా విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు తారక్. ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందని వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియరాలేదు. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.

    అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజే నిర్మించబోతున్నారట. ఈ మధ్య దిల్ రాజుకు శంకర్ మరో అదిరిపోయే కథ వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చిందని, ఆ కథతోనే యన్టీఆర్‌తో సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. శంకర్‌తోనే ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఆర్సీ 15 అయిపోయిన తర్వాత.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏ డైరెక్టర్‌తో ఉండబోతోంది..! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టైటిల్ ఏంటి..! ఈ విషయాలు తెలియాలంటే.. మరిన్నిరోజులు ఆగాల్సిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Jr ntr, Prashanth Neel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు