ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పొలిటికల్ టచ్..

అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో త్రివిక్రమ్ మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: January 25, 2020, 4:32 PM IST
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పొలిటికల్ టచ్..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో త్రివిక్రమ్ మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో పాండవులతో సంధి కుదరక పోయినా.. ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే తిక్కన్న మహాభారతంలో వాడిన పదజాలం ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఇపుడు అదే పదజలాన్ని త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా కోసం వాడుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోతన.. భాగవతంలో ఉన్న‘అల వైకుంఠపుమురములో’ అనే పద బంధం ఉంటుంది. ఈ  ‘అల వైకుంఠపుమురములో’ అనే పద బందన్నే త్రివిక్రమ్ తాజాగా తన  సినిమా కోసం వాడుకున్నాడు. అంతకు ముందు శ్రీ సీతారామ చంద్ర సమేత అనే పదబంధాన్ని ‘అరవింద సమేత వీరరాఘవ’కు వాడకున్నాడు. ఈ రకంగా పురాణాలు, ఇతిహాసాల్లోని చక్కటి పదబంధాలను తెలుగు సినిమాలకు టైటిల్స్‌గా వాడుకుంటున్నాడు త్రివిక్రమ్.

after ala vaikunthapurramloo success trivikram next movie with jr ntr and new movi title as ayinanu poyiraavale hasthinaku,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Twitter/photo)


తాజాగా ఎన్టీఆర్ సినిమా కోసం ‘అయినను పోయి రావలె హస్తినకు’ టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫాక్ష్యన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇపుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాను పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ గతంలో ‘నాగ’ సినిమాలో కాలేజీ రాజకీయాల నేపథ్యంలో ఒక సినిమా చేసాడు. ఆ తర్వాత మళ్లీ రాజకీయ నేపథ్యమున్న సినిమా చేయలేదు. ఇపుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాతో మరోసారి పొలిటికల్ నేపథ్యమున్న సినిమా చేయబోతున్నట్టు టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు. మొత్తానికి వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాను  సమ్మర్‌లో మొదలుపెట్టి.. వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
First published: January 25, 2020, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading