పెనివిటి సాంగ్ ప్రోమో.. అర‌వింద నీకేమైనా అర్థ‌మైందా..?

అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు ప‌ట్టుకుని చెప్పొచ్చు అంటారు కానీ అన్ని సార్లు అది వ‌ర్క‌వుట్ కాదు. అప్పుడ‌ప్పుడూ ఉడ‌క‌కుండా కూడా ఉడికిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇప్పుడు థ‌మ‌న్ పాట‌ల‌ను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 6, 2018, 5:46 PM IST
పెనివిటి సాంగ్ ప్రోమో.. అర‌వింద నీకేమైనా అర్థ‌మైందా..?
అరవింద సమేత
  • Share this:
ఇప్పుడు అంతా షాక్ అవుతున్న‌ది కూడా ఇదే. అస‌లు త్రివిక్ర‌మ్ ఊహ‌లు అందుకోవ‌డం క‌ష్టం అనుకున్నాం కానీ మ‌రీ ఇంత‌గా అందుకోకుండా ఉంటామ‌ని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు. అస‌లు స్యాడ్ పాటలో డాన్సులు ఏంటో.. పెనివిటి అంటూ ఎన్టీఆర్ పాడ‌టం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. 30 సెక‌న్ల ప్రోమో చూడ్డానికే ఏదో తేడా కొడుతుంది. మ‌రి రేపు సినిమాలో ఈ పాట ఎలా ఉండ‌బోతుందో..? అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు ప‌ట్టుకుని చెప్పొచ్చు అంటారు కానీ అన్ని సార్లు అది వ‌ర్క‌వుట్ కాదు.

పెనివిటి సాంగ్ ప్రోమో.. అర‌వింద నీకేమైనా అర్థ‌మైందా..? ntr trivikram peniviti promo song released
అరవింద సమేత


అప్పుడ‌ప్పుడూ ఉడ‌క‌కుండా కూడా ఉడికిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇప్పుడు థ‌మ‌న్ పాట‌ల‌ను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. "అర‌వింద స‌మేత‌"లో తొలిపాట విడుద‌లైన‌పుడు అంతా భ‌లే ఉందే అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తీరు మారిపోయింది. పెనివిటి వీడియో ప్రోమో ఆక‌ట్టుకోవ‌డం లేదు. లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేసిన‌పుడు స్కెచెస్ వేసి.. ఓ ఆర్ధ్ర‌త‌తో కూడిన భావాన్ని చూపించాడు త్రివిక్ర‌మ్. కానీ ఇప్పుడు వీడియో మాత్రం చాలా నాన్ సింక్ అనిపించింది. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కు సాహిత్యం అందించాడు. ఆయ‌న ఎప్ప‌ట్లాగే అద్భుత‌మైన మాట‌లు రాసాడు.ఈ పాట సినిమాలో చాలా ఎమోష‌న‌ల్ సిచ్యువేష‌న్‌లో వ‌స్తుంద‌ని అనుకున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఈ వీడియో ప్రోమో చూస్తుంటే ఇంకేదో అనిపిస్తుంది. "నాన్న‌కు ప్రేమ‌తో" సినిమాలో తాగి పాడే పాట మాదిరే ఉంది ఇది కూడా. అస‌లు ఎలాంటి సిచ్యువేష‌న్‌లో పెట్టినా కూడా హీరో పెనివిటి అంటూ ఎలా పిలుస్తాడో అర్థం కావ‌డం లేదు. అందుకే త్రివిక్ర‌మ్ ఊహ‌లు అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. మొత్తానికి స్వామి ఊహ‌లు ఏంటో అర్థం కావాలంటే అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానున్న "అర‌వింద స‌మేత" చూడాల్సిందే.
Published by: Praveen Kumar Vadla
First published: October 6, 2018, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading