హోమ్ /వార్తలు /సినిమా /

NTR Trivikram : ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా తమిళ సూపర్ స్టార్ ఖరారు.. అక్టోబర్ నుంచి స్టార్ట్..

NTR Trivikram : ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా తమిళ సూపర్ స్టార్ ఖరారు.. అక్టోబర్ నుంచి స్టార్ట్..

Kollywood star hero Simu in Ntr and Trivikram Movie Latest Update

Kollywood star hero Simu in Ntr and Trivikram Movie Latest Update

NTR Trivikram Movie : ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో వస్తోన్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ సినిమా రాజమౌళి సినిమా తర్వాత ఉండనుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్‌గా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ తమిళ హీరో నటించనున్నాడని తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో విలన్ గా తీసుకోబోతున్నారట. శింబు తెలుగులో కూడా చాలా ఫేమస్. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద విజయాలను సాధించాయి.  ఇక కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ విలన్ రోల్ లో నటించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్‌గా ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ వరీనా హుసేన్ హీరోయిన్’గా ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తోన్న ఈ సినిమా స్కిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయ్యింది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడని సమాచారం. పాన్ ఇండియా లెవెల్‌లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ఈ రెండు క్యారెక్టర్స్ పోటాపోటిగా ఉండనున్నాయని తెలుస్తోంది.ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్నది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోందట.

First published:

Tags: Jr ntr, Tollywood Movie News

ఉత్తమ కథలు