హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనున్న శ్రీదేవి కూతురు... మరి పూజా హెగ్డే పరిస్థితి..

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనున్న శ్రీదేవి కూతురు... మరి పూజా హెగ్డే పరిస్థితి..

NTR Photo : Twittter

NTR Photo : Twittter

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవలే రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవలే రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకుకు షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్.  ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్‌‌‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.’అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే. జులై నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.

Janhvi kapoor to romance with tarak , Ntr trivikram new film, pooja hegde,ntr,jr ntr,jr ntr politics,jr ntr tdp politics,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే
ఎన్టీఆర్, జాన్వీ కపూర్.. Photo : Twitter

First published:

Tags: Janhvi Kapoor, Jr ntr, Pooja Hegde

ఉత్తమ కథలు