ఎన్టీఆర్‌ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా మళ్లీ ఆమెనా...

Ntr Trivikram film Update : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 22, 2020, 10:06 AM IST
ఎన్టీఆర్‌ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా మళ్లీ ఆమెనా...
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
Ntr Trivikram film Update : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ మే నెలలో పూర్తి కానుంది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకుకు షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్.  ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫాక్ష్యన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇపుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాను పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఇందులో ఓ రాజకీయ నాయకుడి కొడుకులా నటించబోతున్నాడట ఎన్టీఆర్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్. సమ్మర్ 2021లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో మరోసారి త్రివిక్రమ్‌కు బాగా కలిసొచ్చిన పూజాహెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసిన ఫస్ట్ మూవీ 'అరవింద సమేత'తో పాటు రీసెంట్‌గా వచ్చిన 'అల వైకుంఠపురములో'నూ పూజా అందాలు సినిమాకు కలిసొచ్చాయి. దీనికి తోడు అటు ఎన్టీఆర్‌తో జోడి కూడా కుదురుతుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.

అరవింద సమేతలో ఎన్టీఆర్, పూజా హెగ్డే Photo : Twitter
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు