• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NTR TRIVIKRAM MOVIES GOING TO SETS FROM EARLY NEXT YEAR AND THAT STAR HERO WILL BE IN NEGATIVE ROLE PK

NTR Trivikram: ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరోను సెట్ చేస్తున్న త్రివిక్రమ్..

NTR Trivikram: ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరోను సెట్ చేస్తున్న త్రివిక్రమ్..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ Photo : Twitter

NTR Trivikram: జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి హిట్ సినిమా తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో..

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి హిట్ సినిమా తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. వచ్చే ఏడాది ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. అన్నీ కుదిర్తే 2021 సమ్మర్‌లో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముందు రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు. అందుకే దాన్ని మార్చి చూపించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో షాకింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తుంది.
jr ntr,jr ntr twitter,trivikram srinivas twitter,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ Photo : Twitter

సినిమా అంతా తారక్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడా లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అనేది మాత్రం సస్పెన్స్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒకరు సమంత అని ప్రచారం జరుగుతుంది. మరొరు బాలీవుడ్ నుంచి రానున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాజకీయ నేపథ్యంలో సినిమా రానుందని తెలుస్తుంది. దాంతో పాటు ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
jr ntr,jr ntr twitter,trivikram srinivas twitter,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్
ఉపేంద్ర (Upendra)

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మాటల మాంత్రికుడు చెప్పిన కథ నచ్చి ఉప్పీ దాదా కూడా నటించడానికి ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇందులో పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా నటించనున్నాడు ఉపేంద్ర. మరోవైపు ఎన్టీఆర్ కూడా పొలిటికల్ లీడర్‌గానే కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురుములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి రానున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదేమైనా కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు పొలిటికల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందా అని చాలా రోజులుగా అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు