news18-telugu
Updated: April 28, 2020, 6:57 AM IST
ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల NTR30 అంటూ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైన వెంటనే.. ఆయన తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో వస్తోంది.అందులో భాగంగా ఈ చిత్రం కోసం రాజకీయ నేపథ్యంతో ఓ సామాజిక అంశాన్ని చర్చించనున్నాడు త్రివిక్రమ్. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ఈ రెండు క్యారెక్టర్స్ పోటాపోటిగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం.
రాజకీయాల నేపథ్యంలో రూపొందుతుందన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ బడా బిజినెస్ మేన్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అందులో భాగంగా ఈ పాత్రను త్రివిక్రమ్ చాలా స్టైలీష్ గా తీర్చిదిద్దాడట. ఎన్టీఆర్ బాడీ లాగ్వేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చూస్తోంది చిత్రబృందం. ఇక మరో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది. థమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశం ఉంది.
Published by:
Suresh Rachamalla
First published:
April 28, 2020, 6:50 AM IST