NTR-Trivikram: ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ హాట్ బ్యూటీ..

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్‌తో పాటు మరో క్రేజీ హాట్ భామను తీసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 21, 2020, 2:43 PM IST
NTR-Trivikram: ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ హాట్ బ్యూటీ..
ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా  మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక కొమరం భీమ్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఎన్టీఆర్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌తో పాటు అదే రీతిలో విమర్శలు కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)


ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్‌లో భారీ కోత విధించినట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్ తమ పారితోషకంలో 30 శాతానికి పైగా తగ్గించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ దాదాపు ఖరారైంది. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి తర్వాత మరోసారి కీర్తి సురేష్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా మరో హీరోయిన్‌గా కేతిక శర్మ దాదాపు ఖరారైంది. కేతిక శర్మతో ఎన్టీఆర్‌తో ఇప్పటికే ఓ టెస్ట్ షూట్ నిర్వహించనట్టు సమాచారం.

NTR Trivikram Movie kethika Sharma Will Play Second Heroine charecter here are the details,ntr trivikram,ntr trivikram budget cut,jr ntr trivikram cast cutting,jr ntr trivikram,jr ntr,jr ntr nabha natesh,nabha natesh act with jr ntr,nabha natesh jr ntr trivikram,ntr trivikram political backdrop movie,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,నభా నటేష్,నభా నటేష్ జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ నభా నటేష్,నభా నటేష్ హీరోయిన్‌గా ఎన్టీఆర్,ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు భారీ కోత
ఎన్టీఆర్ సరసన కేతిక శర్మ (Twitter/Photo)


‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడి ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అసలు ఒక వ్యాపారవేత్త ఎందుకు పొలిటిషన్ కావాల్సి వచ్చిందో ఈసినిమా స్టోరీ. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరోనే విలన్‌గా నటించే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 21, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading