NTR - Trivikram: కొత్త యేడాది సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ .. హీరో ఎన్టీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను డిస్కషన్స్ చేసారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా తెరకెక్కలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. తారక్, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం.
టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్‌లో భారీ కోత విధించినట్టు సమాచారం.
ఇప్పటికే ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్ తమ పారితోషకంలో 30 శాతానికి పైగా తగ్గించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ దాదాపు ఖరారైంది. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి తర్వాత మరోసారి కీర్తి సురేష్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా మరో హీరోయిన్‌గా కేతిక శర్మ దాదాపు ఖరారైంది. కేతిక శర్మతో ఎన్టీఆర్‌తో ఇప్పటికే ఓ టెస్ట్ షూట్ నిర్వహించనట్టు సమాచారం.
‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎఈ చిత్రంలో ఎన్టీఆర్ .. బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడి ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అసలు ఒక వ్యాపారవేత్త ఎందుకు పొలిటిషన్ కావాల్సి వచ్చిందో ఈసినిమా స్టోరీ. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం ముందుగా సంజయ్ దత్ అనుకున్నా.. ఫైనల్‌గా ఉపేంద్రను ఆ పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, New Year 2021, Tollywood, Trivikram Srinivas