Home /News /movies /

NTR31 : ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్‌.. ధృవీకరించిన మైత్రీ మూవీ మేకర్స్..

NTR31 : ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్‌.. ధృవీకరించిన మైత్రీ మూవీ మేకర్స్..

NTR and Prashanth Neel Photo : Twitter

NTR and Prashanth Neel Photo : Twitter

NTR31 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. అది అలా ఉంటే ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ధృవీకరించారు. ఉప్పెన ప్రమోషన్‌లో భాగంగా వారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ విత్ ప్రశాంత్ నీల్ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత ఉండనుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ తమిళ హీరో నటించనున్నాడని తెలుస్తోంది.

    తమిళ సూపర్ స్టార్ హీరో శింబు ఈ సినిమాలో విలన్ గా తీసుకోబోతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

    మరో హీరోయిన్‌గా ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ వరీనా హుసేన్ హీరోయిన్’గా ఖారారు అయినట్లు తెలుస్తోంది.


    ఇక ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ కూడా నటించనున్నాడని టాక్. ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్.








    View this post on Instagram






    A post shared by Jr NTR (@jrntr)





    సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్నది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడు.


    ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సలార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మొన్నటి వరకు తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకుంది. ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. కేజీయఫ్  సినిమాను నిర్మించిన హోంబలే సంస్థే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Jr ntr, Tollywood Movie News, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు