ఎన్టీఆర్‌తో కెజిఎఫ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ సినిమా తర్వాత..

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

news18-telugu
Updated: May 8, 2020, 8:59 AM IST
ఎన్టీఆర్‌తో కెజిఎఫ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ సినిమా తర్వాత..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజిఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్‌ కెజిఎఫ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటూ ఊర్రుతలూగిస్తుంది. దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కనుందట. ఈ సినిమా 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా విడుదల కానుందట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కునున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం.
First published: May 8, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading