హోమ్ /వార్తలు /సినిమా /

Brahmastra: బ్రహ్మస్త్ర ప్రిరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో ?

Brahmastra: బ్రహ్మస్త్ర ప్రిరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో ?

Brahmastra Photo/ Twitter

Brahmastra Photo/ Twitter

ఈ సంవత్సరం షంషేర మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం' మూవీతో మరో సారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది.  రాక్ స్టార్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు స్టార్లు కనిపించనున్నారు.


  ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బిగ్ బి అమితా బచ్చన్, మౌనిక రాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. మెగాస్టార్ ఈ మూవీ కి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీ పై తెలుగు లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్లను కూడా విడుదల చేసింది. ఆ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ బ్రహ్మస్త్రం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను  సెప్టెంబర్ 2వ తేదీన  హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సరం షంషేర మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం' మూవీతో మరో సారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.


  ఇటీవలే బ్రహ్మస్త్ర ట్రైలర్ విడుదలైంది.  'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఇక విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ఉండబోతుందని,  ఈ సినిమా ఓ విజువల్ వండర్ అని అర్థం అవుతోంది. 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్‌లో  కథేంటి? అనేది క్లియర్‌గా చెప్పారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ''నీరు, నిప్పు, వాయువు ప్రాచీన కాలంలో మన మధ్య ఉన్న శక్తులు. అస్త్రాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ కథ సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర' గురించి'' అని అమితాబ్ బచ్చన్ వివరించారు. అప్పుడు వచ్చే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Brahmastra, Ranbir Kapoor

  ఉత్తమ కథలు