జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కెరీర్‌నే ఛేంజ్ చేసింది. నటుడిగా టెంపర్ సినిమా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి ‘సింబా’గా రీమేక్ చేస్తే అక్కడ సూపర్ సక్సెస్ అయింది. మొత్తంగా ఈ సినిమా బాలీవుడ్లో రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అయోగ్య’ ట్రైలర్‌ను చూస్తుంటే..‘టెంపర్’ సినిమాలోని ఎమోషన్‌ను యథాతదంగా దింపేసారు.
తాజాగా ‘అయోగ్య’ సినమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాను ఏప్రిల్ 19 విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా థియోట్రికల్ హక్కులను స్క్రీన్ సీన్ సంస్థ కొనుగోలు చేపినట్టు ఈ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.
సామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లైట్‌హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. మరి తెలుగులో ఎన్టీఆర్ చూపించిన టెంపర్‌ను తమిళంలో విశాల్ ఏ మేరకు చూపిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Kajal Aggarwal, Kollywood, NTR, Raashi Khanna, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vishal