NTR - Abhay Ram - Bhargav ram: కొడుకుల గురించి చెప్తూ మురిసిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరు ఇద్దరే అంటూ?

NTR - Abhay Ram - Bhargav ram

NTR - Abhay Ram - Bhargav ram: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు. మంచి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న నందమూరి కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా ఎన్టీఆర్ ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.

  • Share this:
    NTR - Abhay Ram - Bhargav ram: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు. మంచి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న నందమూరి కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా ఎన్టీఆర్ ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తను నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

    ప్రస్తుతం ఎన్టీఆర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. జెమినీలో ప్రసారమవుతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షోలో హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ పూర్తికాగా అందులో మధ్య మధ్యలో సెలబ్రెటీస్ కూడా గెస్ట్ గా పాల్గొంటున్నారు. ఇటీవలే సార్ దర్శకులు కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ తో వాళ్లు సరదాగా మాట్లాడుకునే మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

    ఇది కూడా చదవండి:అర్ధరాత్రి బాత్రూమ్‌లో లహరీ నువ్వు కౌగిలించుకోలేదా రవి.. ప్రియా ఆంటీ డర్టీ టాక్.. నెటిజన్స్ ట్రోల్

    అందులో టాపిక్ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి పేరు వచ్చింది. ఆయనను తన మనుమరాలు గట్టిగా కొట్టిందని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి చిరంజీవి తనతో చెప్పాడని తెలిపాడు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. రాజమౌళి, ఎన్టీఆర్, కొరటాల కలిసి టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ గురించి మాట్లాడగా అందులో రాజమౌళి, ఎన్టీఆర్ లు కూడా తమకు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ఇష్టమని తెలిపాడు.

    ఇది కూడా చదవండి:రాజమౌళి, కొరటాల గడగడలాడించిన ఎన్టీఆర్.. ఆ ప్రశ్నలతో చమటలు పట్టించేశాడుగా!

    ఈతరం పిల్లల అభిరుచి మొత్తం మారిందని చాలావరకు వైలెంట్ కార్టూన్స్ చూస్తున్నారని తెలుపగా.. వెంటనే కొరటాల తనతో చిరంజీవి పంచుకున్న విషయాన్ని తెలిపాడు. తను సోఫాలో పడుకున్నప్పుడు తన మనుమరాలు వచ్చి గట్టిగా కొట్టేసి వెళ్ళిందని.. ఆ పాపని చూస్తే కార్టూన్స్ లో బాక్సింగ్ పంచు టైపులో కొట్టిందని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ.. తను కూడా మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాడు.. ఎందుకు మూడ్ మారుతుందో తెలియదని అనగా.. వెంటనే అభయ్ ఉండడు.. భార్గవే ఈ పని చేయొచ్చని కొరటాల అనగా.. ఎన్టీఆర్ అభయ్ ఎప్పుడు నా పోలికే.. సౌమ్యుడు.. బాగుంటాడు.. భార్గవ్ ది మాత్రం ప్రణతి పోలిక అంటూ కాస్త ఫన్నీగా తెలిపాడు.
    Published by:Navya Reddy
    First published: