NTR : అభిమానులకు ఎన్టీఆర్ ఆత్మీయ లేఖ.. వారికి అండగా నిలవాలని విన్నపం..

NTR Photo : Twitter

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ లేఖ రాశారు. ఈ కష్టకాలంలో ఎలాంటీ వేడుకలను జరుపవద్దని ఆ లేఖలో ఆయన విన్నవించారు.

 • Share this:
  దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు చిగురుటాకులా వణికుతున్నారు. ఈ కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలను విడుస్తున్నారు. మరోవైపు చాలా మంది మనో ధైర్యంతో పాటు సరైన చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. కరోనా సామన్యుల నుంచి సెలెబ్రిటీస్ వరకు అందరిని దెబ్బకొడుతోంది. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది దీని బారీన పడుతున్నారు. అదే విధంగా కోలుకుంటున్నారు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. దీని గురించి ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో ముఖ్యంగా రేపు తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. తన బర్త్ డేకు సంబంధించి ఎటువంటీ వేడుకలను జరుపవద్దని అభిమానులకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన నోట్‌లో.. మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు అన్ని చూస్తున్నాని మీ అందరి ఆశీస్సులు తనకి ఎంతో ఆనందాన్ని, ఊరట కలిగించాయని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ నుంచి కోలుకుంటున్నానని.. తాను కోవిడ్ ని జయిస్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండాలనీ.. లాక్ డౌన్, కర్ఫ్యూ లను పాటిస్తూ కుదిరితే ఈ లాక్ డౌన్ వల్ల లేదా కరోనా వలన ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలవాలనీ అభిమానులను కోరారు.

  ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకొని మాస్క్ ధరించి, కరోనాను సమూలంగా జయించిన రోజున మనమంతా కలిసి వేడుక చేసుకుందాం అని ఎన్టీఆర్ అభిమానులను కోరారు. ఇక రేపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ ఈ నెల 10న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకినట్టు తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక్కడ మరో విషయం ఏమంటే ఎన్టీఆర్‌కు మాత్రమే కాకుండా ఇంట్లో పిల్లలకు కూడా కరోనా సోకిందని అంటున్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కరోనా బారీన పడడంతో వైద్యుల సూచనలను పాటిస్తూ, ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, చిరంజీవి, నారా లోకేష్, మహేష్ బాబు వంటి ప్రముఖులు ట్వీట్స్ చేసారు.


  ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అగ్ర దర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.

  ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉండగా.. ఆ సినిమా కొన్ని కారణాల వలన ముందుకు పోలేదు. దీంతో ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడని ఆ మధ్య ఓ వార్త రాగా ఆ విషయంపై ఎన్టీఆర్ తాజాగా స్పష్టతనిచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అంతేకాదు ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే.
  Published by:Suresh Rachamalla
  First published: