ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌లో కూడా ఐమాక్స్ ఫార్మాట్ లేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చూసే అవకాశం లేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చూడాలనే వారికి ఇది ఖచ్చితంగా చేదువార్తే.. అంటూ బాధపడుతున్నారు ఆర్ ఆర్ ఆర్ అభిమానులు. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇక యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో (RRR) ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తున్నారట.
ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Experience India’s biggest action-drama in IMAX! ???? #RRRonMarch25th
@IMAX @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies @RRRMovie #RRRMovie pic.twitter.com/jFMrdyHlHm — RRR Movie (@RRRMovie) March 9, 2022
ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజే స్పెషల్ షోస్ వేయనున్నట్టు సమాచారం.
Poorna : మత్తైనా చూపులతో పిచ్చెక్కిస్తోన్న మలయాళీ అందం పూర్ణ.. అదిరిన లేటెస్ట్ పిక్స్..
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: RRR, Tollywood news