Home /News /movies /

RRR Third Single : ఆర్ ఆర్ ఆర్ నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్..

RRR Third Single : ఆర్ ఆర్ ఆర్ నుంచి మూడో పాటకు ముహూర్తం ఫిక్స్..

RRR Photo: Twitter

RRR Photo: Twitter

RRR Third Single : ఈ సినిమా నుంచి మూడో సాంగ్’ను కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అయ్యింది. ఈ సాంగ్ ని మేకర్స్ వచ్చే నవంబర్ 24 న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీవల నాటు నాటు అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ పాడారు. తెలుగు వర్షన్ ఇప్పటికే ఇరవై మిలియన్ వ్యూస్‌ను రాబట్టి టాప్’లో ట్రెండ్ అవుతోంది.

    ఇక మూడో సాంగ్’ను కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అయ్యింది. ఈ సాంగ్ ని మేకర్స్ వచ్చే నవంబర్ 24 న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది.


    ఈ సినిమా నుంచి నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఓ 46 సెకండ్స్ ఉన్న ఈ గ్లింప్స్ మామూలుగా లేదు. విజువల్ వండర్‌గా ఉందని చెప్పోచ్చు. ఈ గ్లింప్స్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అదిరిపోయాయి.

    Anjali: ప్లోరల్ టాప్‌లో క్యూట్‌గా అదరగొట్టిన అంజలి... అదిరిన లేటెస్ట్ పిక్స్..

    ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

    ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rrr movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు