Home /News /movies /

NTR RAM CHARAN RAJAMOULI RRR SECOND SINGLE NAATU NAATU GETS HUGE RESPONSE ON YOUTUBE SR

RRR : నాటు నాటుకు 30 మిలియన్ వ్యూస్.. ఆ విషయంలో జగన్‌ను కలుస్తాం.. : నిర్మాత దానయ్య..

Naatu Naatu song Photo : Twitter

Naatu Naatu song Photo : Twitter

RRR : విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీలవ మరో సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాటు నాటు అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో అదరగొడుతోంది.

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీలవ మరో సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాటు నాటు అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో అదరగొడుతోంది.

  ఈ పాటను నవంబర్ 10న విడుదల చేయగా.. ఇప్పటివరకు ఈ సాంగ్ యూట్యూబ్‌లో’ అన్ని భాషాల్లో కలిపి 30 మిలియన్ వ్యూస్‌పైగా సాధించి అదరగొట్టింది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 7న విడుదలకానున్న నేపథ్యంలో టికెట్స్ రేట్ల గురించి చిత్రబృందం ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కోంది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసిన నిర్మాత... టికెట్ ధరలు తగ్గించడం మూలాన సినిమా పరిశ్రమ నష్టపోతుంది అనే మాట వాస్తవం. అయితే మేము ఈ సమస్యపై కోర్టు దగ్గరకి వెళ్ళాలి అనుకోలేదు.. దీనిని గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించాలి అనుకుంటున్నామని తమ పోస్ట్‌లో తెలిపారు.


  ఇక ఇటీవల ఈ సినిమా నుంచి నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఓ 46 సెకండ్స్ ఉన్న ఈ గ్లింప్స్ మామూలుగా లేదు. విజువల్ వండర్‌గా ఉందని చెప్పోచ్చు. ఈ గ్లింప్స్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.


  ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

  Allu Arjun | Pushpa : పుష్ప నుంచి మరో మాస్ సింగిల్.. పిచ్చెక్కించిన కొత్త పోస్టర్..

  ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: NTR, Rajamouli, Ram Charan, Rrr movie

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు