హోమ్ /వార్తలు /సినిమా /

RRR Release Date : మరోసారి వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్.. అధికారిక ప్రకటన..

RRR Release Date : మరోసారి వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్.. అధికారిక ప్రకటన..

RRR Release date Photo : Twitter

RRR Release date Photo : Twitter

RRR Release Date : మరోసారి ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది.

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని తెలిసిందే. అయితే ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం. అంతేకాదు కొత్త డేట్‌ను కూడా ప్రకటించలేదు.

దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసిన టీమ్.. ఈ సందర్భంగా రాస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాను విడుదల చేయలేము. అంతేకాదు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించలేము.. ఎందుకంటే ఓ వైపు ప్రపంచంలో దాదాపు థియేటర్స్ అన్ని మూత పడ్డాయి.. ఈ సందర్భంలో మరోసారి కొత్త డేట్ ప్రకటించడం కరెక్ట్‌గా ఉండదని భావిస్తున్నాము.

అన్ని అనుకూలించిన తర్వాత మా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటిస్తాము అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల విషయంలో స్పష్టత వచ్చినట్లు అయ్యింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి ఇటీవలే వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

First published:

Tags: NTR, Ram Charan, RRR

ఉత్తమ కథలు