Home /News /movies /

RRR Release Date : ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఖరారు..

RRR Release Date : ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఖరారు..

NTR and Ram Charan Photo : Twitter

NTR and Ram Charan Photo : Twitter

RRR Release Date : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడగా.. లేటెస్ట్ సమాచారం మేరకు కొత్త విడుదల తేదిన చిత్రబృందం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదిపై ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది.

    కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను సమ్మర్ కానుకగా మార్చి 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా విడుదల (RRR Release Date) విషయంలో అధికారిక ప్రకటన ఈరోజు రానుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి వచ్చింది.

    Vishwak Sen : సూపర్ హిట్ చిత్రానికి డబ్బింగ్ స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..

    ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.



    Priyamani: పొట్టి నిక్కరులో పిచ్చెక్కించిన ప్రియమణి.. వావ్ అనాల్సిందే..

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

    ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: NTR, Ram Charan, RRR

    తదుపరి వార్తలు