ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. ఇటీవల ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించారు.
ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ ను వచ్చే నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది. గ్లింప్స్ మామూలుగా లేదు. విజువల్ వండర్‌గా ఉందని చెప్పోచ్చు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అదిరిపోయాయి. ఈ గ్లింప్స్‌లో విజువల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Here’s #RRRGlimpse…
Get ready to experience high-octane action drama on the big screen from 7th Jan, 2022. #RRRMovie https://t.co/JKmpLbwdaw@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies
— Jr NTR (@tarak9999) November 1, 2021
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NTR, Ram Charan, Rrr movie, SS Rajamouli