ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసిన టీమ్.. తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీవల నాటు నాటు అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ పాడారు. ఇక తాజాగా మూడో సాంగ్ జనని (Janani) కూడా విడుదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ (Alia Bhatt), అజయ్ దేవగణ్, శ్రియ శరణ్‌లు ఈ వీడియో సాంగ్‌లో కనిపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూనే, ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఏమోషన్ లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది జనని. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ అదరగొడుతోంది. ఈ పాట రెండు గంటల్లో టూ మిలియన్ వ్యూస్ సాధించి అదరగొట్టింది.
#RRR runtime is 3 hrs 6 mins
Rated U/A#RRRMovie #RRRSoulAnthem pic.twitter.com/55PFFkmUI3
— BINGED (@Binged_) November 26, 2021
ఈ సినిమా నుంచి నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఓ 46 సెకండ్స్ ఉన్న ఈ గ్లింప్స్ మామూలుగా లేదు. విజువల్ వండర్‌గా ఉందని చెప్పోచ్చు. ఈ గ్లింప్స్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.
Ananya Nagalla : మరోసారి పరువాల విందు చేసిన వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల..
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NTR, Ram Charan, RRR, Tollywood news