RRR - Rajamouli: అభిమానులకు మళ్ళీ షాక్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సంక్రాంతికి కూడా డౌటే?

RRR - Rajamouli

RRR - Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    RRR - Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమా గురించి ఏవైనా అప్ డేట్స్ వస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది.

    భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు భారీ అంచనాలే వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా వీరి లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది.

    దీంతో తిరిగి షూటింగులు జరుగుతుండగా.. ఈ సినిమా కూడా మిగిలిన భాగం షూటింగ్ లో బాగా బిజీ గా ఉంది. ఇక ఈ సినిమాను గతంలో అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ సెకండ్ వేవ్ తో మళ్లీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల కావడం డౌటే అని దర్శకుడు రాజమౌళి అనుకోగా సంక్రాంతి కైనా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలకు తమ సినిమా వల్ల డిస్టర్బ్ కావద్దని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి.

    ఈ నేపథ్యంలో ఈ సినిమాను మళ్లీ వాయిదా వేయడం తప్ప మరో ఆలోచన లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకోగా.. తాజాగా ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సారి ఉగాదికి ఈ సినిమా వచ్చినట్లయితే తెలుగు ప్రేక్షకులకు అసలైన పండగ ఆర్ఆర్ఆర్ అనే చెప్పవచ్చు.
    Published by:Navya Reddy
    First published: