టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ క్రమంగా పెరిగిపోతోంది. తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి తెలుస్తుండటంతో దేశవిదేశాల్లో స్టార్ హీరోల హంగామా నడుస్తోంది. ఈ తరం హీరోలైన ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan), ప్రభాస్ (Prabhas) లాంటి వాళ్ళు విదేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ ఉండటం విశేషం. అయితే వీళ్ళ వెనుక రాజమౌళి (Rajamouli) ఉన్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి రూపొందించిన బాహుబలితో ప్రభాస్, RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు.
కాగా, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లో 21/10/2022 విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ తమ కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లారు. అక్కడ వీధి వీధిన సందడి చేస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ నేపథ్యంలో జపాన్ వీధుల్లో రద్దీ ప్రదేశాల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా కలిసి నడుస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు చెర్రీ. చేతుల్లో రోజా పువ్వులు పట్టుకొని, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వీడియోకు RRR సినిమాలోని దోస్తీ సాంగ్ యాడ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు రామ్ చరణ్. దీంతో ఈ వీడియో చూసి మెగా, నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఇదీ కిక్కంటే అంటూ కామెంట్లు పెడుతూ మురిసిపోతున్నారు.
View this post on Instagram
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలైన సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి రికార్డులు తిరగరాసింది. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజమౌళి స్టైల్ టేకింగ్, ఇద్దరు హీరోల (ఎన్టీఆర్, రామ్ చరణ్) నటన ఈ సినిమా స్థాయిని నిలబెట్టాయి. RRR చూసి తెలుగోడు కాలర్ ఎగిరేసే మూవీ ఇది అని మరోసారి చెప్పుకున్నారు జనం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Ram Charan, RRR