NTR | Ram Charan : కైవ్ నగర వీధుల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు.. వైరల్ అవుతోన్న వీడియో..

NTR and Ram Charan Photo : Twitter

NTR | Ram Charan : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఓ రెండు పాటల కోసం చిత్రబృందం ఉక్రెయిన్ వెళ్లింది. ఇక అక్కడి నుంచి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉంది. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి బృందం మరో వీడియోను విడుదల చేసింది. ఉక్రెయిన్‌ దేశంలోని కైవ్ నగరంలో అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. ఓ లగ్జరీ కారులో ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు కూర్చోని  షూటింగ్ లోకేషన్‌కు బయలుదేరుతున్నారు. ఆ కారులో ఇటీవల ఆర్ ఆర్ ఆర్ నుంచి విడుదలైన దోస్తీ సాంగ్‌ ప్లే అవుతోంది. దీంతో ఆ పాటను ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








    View this post on Instagram






    A post shared by RRR Movie (@rrrmovie)





    ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాట స్నేహం గొప్పదనం తెలుపుతోంది. హేమచంద్ర పాడారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published: