NTR | Ram Charan : ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పూర్తి చేశారు.. ఇప్పుడు ఆ సీనియర్ నటుడి వంతు...

NTR Ram, Charan Photo : Twitter

RRR Release Date : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.  విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం టీమ్‌లో ఒక్కరుగా డబ్బింగ్ చెప్పుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు తమ డబ్బింగ్‌ను పూర్తి చేయగా.. ప్రస్తుతం సీనియర్ నటుడు హిందీ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ మొదలు పెట్టారు.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఇటు కరోనా కేసులు తగ్గడంతో పాటు అటు ఏపీలో కూడా టికెట్ రేట్ల విషయంలో త్వరలో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదిని మరోసారి ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

    విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం టీమ్‌లో ఒక్కరుగా డబ్బింగ్ చెప్పుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు తమ డబ్బింగ్‌ను పూర్తి చేయగా.. ప్రస్తుతం సీనియర్ నటుడు హిందీ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ మొదలు పెట్టారు. ఆయన తన పాత్ర కోసం హిందీలో డబ్బింగ్ చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషాల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారట. ఇక ఈ సినిమా కోసం ఆలియా భట్ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతోందని టాక్.

    Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా ప్రకటించిన జనవరి 7న కూడా విడుదలయ్యే అవకాశాలు తక్కువుగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 7న కాకుండా జనవరి 26న (RRR Release Date) విడుదలకానుందని తాజాగా వినిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26కి విడుదల అవుతుందని సమాచారం. ఆ డేట్ అయితే సినిమా జానర్‌కు కూడా సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

    Anchor Sreemukhi : ఎరుపు రంగు టాప్‌లో సీమ్లా యాపిల్‌లా శ్రీముఖి.. అదరహో అనాల్సిందే...

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

    ఎం.ఎం. కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: