గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరోలు ఎలాంటి ఈగోలకు పోకుండా కలిసి కట్టుగా ఉంటూ ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మహేష్ హీరోగా ‘భరత్ అను నేను’ సినిమాకు తారక్ గెస్ట్‌గా వెళ్లి మహేష్‌కు బెస్ట్ విషెస్ అందజేశాడు.
రీసెంట్గా అఖిల్ హీరోగా నటించిన ‘Mr.మజ్ను’ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై అఖిల్‌కు సినిమాను ప్రమోట్ చేసాడు. ఈ నేపథ్యంలో హీరోల మధ్య స్నేహాన్ని చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. తాజాగా నందమూరి,అక్కినేని, కొణిదెల ఫ్యామిలీకి చెందిన తారక్, అఖిల్, రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులకు కనువిందు చేసారు. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆల్రెడీ తారక్..అఖిల్ ‘Mr.మజ్ను’ ప్రీ రిలీజ్‌కు హాజరై బెస్ట్ విషెస్ అందజేస్తే..రామ్ చరణ్ మాత్రం ‘Mr.మజ్ను’ సక్సెస్ కావాలని అఖిల్‌కు అభినందనలు తెలియజేసాడు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ‘Mr.మజ్న’సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు అఖిల్. ఈ నెల 25న ఈ సినిమా విడుదల కాబోతుంది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు.
బాలీవుడ్ హాట్ కపుల్స్
ఇవి కూడా చదవండి
ప్రారంభమైన రామ్, పూరీ జగన్నాథ్‌ల ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ
సౌత్ ఇండస్ట్రీని విడిచిపెట్టనంటున్న అక్షయ్
శంకర్, రాజమౌళిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ ?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Jr ntr, Ram Charan, Telugu Cinema, Tollywood