NTR : ఫ్యాన్సీ నంబర్ కోసం ఎన్టీఆర్ అంత ఖర్చు చేశారా.. మరో కొత్త కారు వస్తుందిగా..

NTR with his new Car Photo : Twitter

NTR : యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఈ మధ్యే లంబోగిని కంపెనీకి చెందిన ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నారు. కాగా ఈ కారు నంబర్ కోసం ఆయన దాదాపు 17 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది.

 • Share this:
  యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  (NTR) కు కార్ల మీద మక్కువ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఈ మధ్యే లంబోగిని కంపెనీకి చెందిన ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా తనకు నచ్చినా.. మెచ్చిన ఫ్యాన్సీ కారు నంబర్‌ కోసం తెలంగాణ ప్రభుత్వానికి 17 లక్షలు చెల్లించారని టాక్ నడుస్తోంది. తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్‌ దక్కించుకున్నాడని తెలుస్తోంది. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని సమాచారం. ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం గతంలో కూడా పది లక్షలు పెట్టి సొంతం చేసుకున్నారు.

  ఇక ఇక్కడ విషయం ఏమంటే.. ఎన్టీఆర్‌ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది. కొత్తగా ఏ కారు తీసుకున్నా కూడా ఎన్టీఆర్ ఆ కారుకు 9999 అనే నెంబర్‌ వచ్చేలా చూసుకుంటారు. ఇది తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ నుంచి వచ్చిందని అంటారు. తనకు 9999 నంబర్ ఇష్టమట. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ కారు నంబర్‌గా వాడారని, అందుకే తనకు ఆ నెంబర్‌ ఇష్టమని, అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తారక్‌. ఇంకో విషయం ఏమంటే... ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ కూడా 9999తో వుంటుంది.

  Amardeep - Ashu Reddy: సీరియల్ హీరో చనిపోయాడంటూ యూట్యూబ్ వీడియో.. మండిపడ్డ అషు రెడ్డి.. అతర్వాత జరిగింది ఇదే

  ఇక ఆయన నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమలో నటిస్తున్నారు.  ఎన్టీఆర్ (NTR) ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే “మీలో ఎవరో కోటీశ్వరులు”   (Evaru Meelo Koteeswarulu) షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్‌ బద్దలుకొట్టాడనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబందించిన షూట్ కూడా ఇటీవలే జరిగినట్లు సమాచారం.  ఈ ఎపిసోడ్‌ను.. మొన్న ఆదివారమే ఈ షూట్ కంప్లీట్ చేశారని సమాచారం. ఈ ఎపిసోడ్ దసరా పండుగకు ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.

  ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని గతంలో ప్రకటించినా.. తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

  Ariyana - Devi Nagavalli: ఒకే రోజు కొత్త కార్లు కొన్న బిగ్ బాస్ బ్యూటీలు దేవి నాగవల్లి, అరియనా.. కార్ల ధర ఎంతంటే?

  ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ 30లో కియారా అద్వానీ (Kiara advani) నటిస్తుందని టాక్ రాగా.. ఆమె స్థానంలో పూజ హేగ్డే  (Pooja Hegde )వచ్చి చేరింది అని తాజా సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ 30 లో పూజ హెగ్డే దాదాపు ఖరారు అయినట్లేనట. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా పూజాకు భారీ క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు పూజా వైపు చూస్తున్నారట. ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

  ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
  Published by:Suresh Rachamalla
  First published: