HOME »NEWS »MOVIE »ntr not attend dil raju birthday celebrations and nandamuri family events here are the reasons ta

NTR: ఎన్టీఆర్‌‌ను వాళ్లు కావాలనే దూరం పెట్టారా.. అసలు నిజం ఏమిటంటే..

NTR: ఎన్టీఆర్‌‌ను వాళ్లు కావాలనే దూరం పెట్టారా.. అసలు నిజం ఏమిటంటే..
ఎన్టీఆర్ (Twitter/Photo)

NTR: ఎన్టీఆర్‌‌ను వాళ్లు కావాలనే దూరం పెట్టారా.. లేకపోతే వేరే కారణాలతో ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేదా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలుబడుతున్నాయి.

  • Share this:
    NTR: ఎన్టీఆర్‌‌ను వాళ్లు కావాలనే దూరం పెట్టారా.. లేకపోతే వేరే కారణాలతో ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేదా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలుబడుతున్నాయి. ఈ నెలలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో తన పెళ్లిని చాలా సింపుల్‌గా  కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో  చేసుకున్నారు. దీనికి ఇండస్ట్రీ తరుపున ఎవరు ఈ మ్యారేజ్‌కు పెద్దగా హాజరు కాలేదు.  దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు దిల్ రాజు. అందుకు తన 50వ పుట్టినరోజున ఇండస్ట్రీ పెద్దలను పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకలో నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు తప్ప.. మిగిలిన వాళ్లందరు హాజరయ్యారు.

    ఈ వేడుకలో మెగా హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు ప్రభాస్, కన్నడ స్టార్ హీరో యశ్ కూడా దిల్ రాజు బర్త్ డే వేడుకల్లో సందడి చేసారు. కానీ వీరిలో బాలకృష్ణ, ఎన్టీఆర్ లేని లోటు  మాత్రం స్పష్టంగా కనిపించింది. ఐతే.. బాలకృష్ణకు దిల్ రాజు నుంచి ఆహ్వానం అందినా.. తన అన్నయ్య కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి కూడా అదే సమయంలో ఉండటంతో ఆయన హాజరు కాలేకపోయారు.



    dil raju,dil raju twitter,dil raju party to tollywood celebs,dil raju wife second marriage,dil raju second marriage,dil raju grand party to tollywood,dil raju birthday party,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు గ్రాండ్ పార్టీ,దిల్ రాజు బర్త్ డే పార్టీ డిసెంబర్ 18
    దిల్ రాజు పార్టీలో టాలీవుడ్ హీరోలు (Dil Raju Party)


    మరోవైపు జూనియర్ ఎన్టీఆర్... దిల్ రాజు పుట్టినరోజు వేడుకలతో పాటు తన అన్నయ్య చైతన్య కృష్ణ పెళ్లి వేడుకలకు హాజరు కాలేదు. ఐతే.. ఈ పెళ్లి వేడుకలో బాలకృష్ణ దంపుతులుతో పాటు కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీతో కలసి ఈ మ్యారేజ్‌లో సందడి చేసారు. ఐతే.. తారక్ మాత్రం ఈ మ్యారేజ్‌కు ఎందుకు హాజరు కాలేదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదంటే.. అన్నయ్య పెళ్లి ఉంది కాబట్టి హాజరు కాలేదని అనుకున్నారు. కానీ అక్కడ ఎన్టీఆర్ జాడ లేదు. తన కుటుంబానికి చెందిన పెళ్లిలో జూనియర్‌‌కు ఆహ్వానం అందలేదా  అంటే అదేమి లేదు. ఈ పెళ్లికి రమ్మని తారక్‌కు ఆహ్వానం కూడా అందింది. మరోవైపు దిల్ రాజు బర్త్ డే వేడుకలకు కూడా ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా వెళ్లలేకపోయాడు.

    nandamuri chaitanya krishna marriage,nandamuri balakrishna,nandamuri chaitanya krishna,nandamuri chaitanya krishna wedding,nandamuri chaitanya krishna fires on ap cm ys jagan,nandamuri chaitanya krishna marriage,nandamuri mokshagna in chaitanya krishna engagement,నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి,నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి బాలకృష్ణ
    నందమూరి చైతన్య కృష్ణ పెళ్లిలో బాలకృష్ణ దంపతుల సందడి (nandamuri chaitanya krishna wedding)


    దీనికి పెద్ద రీజనే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్‌‌కు వేరే నటీనటులతో కొన్నికాంబినేషన్ సీన్స్ షూట్ కంప్లీట్ చేయాలి. ఇప్పటికే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. మరోసారి వేరే నటీనటుల డేట్స్ అడ్జస్ట్ కావాలంటే మాములు విషయం కాదు. ఇంకోవైపు జక్కన్న ఈ సినిమా షూటింగ్‌ను అర్ధరాత్రి వేళలో కొన్ని ఫైట్స్ సీన్స్  తెరకెక్కిస్తున్నాడట. ఒకవేళ రాత్రి వేళలో షూటింగ్ లేకపోయి ఉంటే.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ఈ వేడకలకు హాజరయ్యేవాడని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.

    RRR NTR Komaram Bheem RAMARAJU FOR BHEEM SPOOF Video Go Viral On Social Media,jr ntr,jr ntr bheem teaser,RAMARAJU FOR BHEEM SPOOF,RRR NTR Spoof Video,rrr movie twitter,rrr movie bheem teaser controversy,bheem teaser sc st fires on rajamouli,telugu cinema,రాజమౌళి,ట్రిపుల్ ఆర్ భీమ్ టీజర్‌పై ఫైర్,ఆదివాసీలు రాజమౌళికి వార్నింగ్,ఎన్టీఆర్ కొమరం భీమ్ స్పూఫ్ వీడియో,సోషల్ మీడియాలో వైరల్
    ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ (Twitter/Photo/RRR Team)


    కానీ  అక్కడ కూడా ఎంతో మంది నటీనటులతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయట. మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రత్యేక గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ రకంగా ఆర్ఆర్ఆర్ షెడ్యూల్‌కు డిస్ట్రబ్ కావడం ఇష్టం లేకనే ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేదని చెబుతున్నారు.  మరోవైపు  దిల్ రాజు వేడుకల్లో రాజమౌళి కూడా అందుకే  కనిపించలేదు. మొత్తంగా టాలీవుడ్ సినీ హీరోలందరు హాజరైన ఈ వేడుకలో ఎన్టీఆర్ లేకపోవడం పెద్ద లోటు అని తారక్ ఫ్యాన్స్ ఒకింత నిరాశలో ఉన్నారట.మొత్తంగా ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగానే ఈ వేడుకలకు హాజరు కాలేదనే విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే తప్ప వేరే విషయాలు ఏమి లేంటూ తారక్.. వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:December 24, 2020, 08:23 IST