"అర‌వింద స‌మేత‌"లో ఎన్టీఆర్ అంతసేపు మౌనమా..?

ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్.. డైలాగ్స్ అంటేనే ఎన్టీఆర్. ఆయ‌న స్క్రీన్‌పై అలా గ‌ల‌గ‌ల మాట్లాడ‌దుతుంటే అభిమానులు పండ‌గ చేసుకుంటారు. ఇక అలాంటి హీరోకు ఇప్పుడు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు దొరికితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 7, 2018, 5:19 PM IST
ఎన్టీఆర్ అరవింద సమేత
  • Share this:
ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్.. డైలాగ్స్ అంటేనే ఎన్టీఆర్. ఆయ‌న స్క్రీన్‌పై అలా గ‌ల‌గ‌ల మాట్లాడ‌దుతుంటే అభిమానులు పండ‌గ చేసుకుంటారు. ఇక అలాంటి హీరోకు ఇప్పుడు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు దొరికితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. అస‌లే డైలాగులు రాయ‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట‌.. వాటిని చెప్ప‌డంలో ఎన్టీఆర్ దిట్ట. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే ర‌చ్చ ర‌చ్చే. ఇప్పటికే ట్రైలర్ డైలాగ్స్ రచ్చ చేస్తున్నాయి. రేపు సినిమాలో ఎలా ఉంటాయో అనే అంచనాలు పెరిగిపోయాయి కూడా.

"అర‌వింద స‌మేత‌"లో ఎన్టీఆర్ అంతసేపు మౌనమా..? ntr no dialogues for first 30 minutes in aravinda sametha..
అర‌వింద స‌మేత‌


ఇప్పుడు "అర‌వింద స‌మేత‌"లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌స్తుంది. ఈ సినిమాలో తొలి అర‌గంట ఎన్టీఆర్‌కు మాట‌లు ఉండ‌వ‌ని.. మ‌రీ అవ‌స‌రం అయిన‌పుడు మాత్రమే నోరు తెరుస్తాడ‌ని చెప్పాడు మాట‌ల మాంత్రికుడు. అస‌లు ఎన్టీఆర్ లాంటి హీరోను తొలి అర‌గంట మాట‌ల్లేకుండా ఉంచ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

"అర‌వింద స‌మేత‌"లో ఎన్టీఆర్ అంతసేపు మౌనమా..? ntr no dialogues for first 30 minutes in aravinda sametha..
అర‌వింద స‌మేత‌


ఈ సినిమాలో ప్ర‌తీ ఒక్క విష‌యం ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌చేస్తుంద‌ని.. క‌చ్చితంగా "అర‌వింద స‌మేత" తెలుగులో కొత్త పంథాకు తెర తీస్తుందని ధీమాగా చెబుతున్నాడు త్రివిక్ర‌మ్. ఏదేమైనా ఎన్టీఆర్ లాంటి హీరోతో అంత సేపు మాట్లాడించ‌కుండా ఉండ‌టం అనేది చిన్న సాహ‌సం అయితే కాదు. ఇందులో ఎన్టీఆర్ కారెక్ట‌ర్ "అత‌డు" సినిమాలో మ‌హేష్ బాబులా అవ‌స‌రం అయిన‌పుడు మాత్ర‌మే మాట్లాడ‌తాడ‌ని తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 7, 2018, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading