బాలకృష్ణ వర్సె

NTR Biopic | ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఇందులో ఎవరికీ వారే వారికి తోచిన రీతిలో ఎన్టీఆర్‌ను వాడేసుకుంటున్నారు.ఇప్పటికే రామారావు జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ..‘ఎన్టీఆర్’ జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ గా రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ  చేస్తున్నాడు. ఇప్పటికే విడుదైలన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు లుక్స్‌ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 23, 2019, 2:56 PM IST
బాలకృష్ణ వర్సె
ఎన్టీఆర్ బయోపిక్
  • Share this:
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఇందులో ఎవరికీ వారే వారికి తోచిన రీతిలో ఎన్టీఆర్‌ను వాడేసుకుంటున్నారు. ఇప్పటికే రామారావు జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ..‘ఎన్టీఆర్’ జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ గా రెండు భాగాలుగా తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ సినిమాకు టాక్ బాగున్నా..అందుకు తగ్గ కలెక్షన్లు లేవు.

‘కథానాయకుడు’లో ఎన్టీఆర్.. కథానాయకుడిగా  ఎదిగిన వైనంలో  ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడం..సినిమా మొత్తం రామారావు గొప్పనటుడు..మహానాయకుడని తెలిసినా..ఎక్కడ స్లోప్స్ లేకుండా సినిమా ఎక్కడా నెగిటివిటీ చూపించకుండా తెరకెక్కిన విధానం కామన్ ఆడియన్స్‌ను ఈ సినిమాకు దూరం చేసింది. అందుకే ఇపుడు రాబోయే ‘మహానాయకుడు’లో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో రెండున్నర గంటల్లో చూపించనున్నారు.

మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ  చేస్తున్నాడు. ఇప్పటికే విడుదైలన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు లుక్స్‌ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా దర్శకుడిగా వర్మ ట్రాక్ రికార్డు బాగాలేకపోయినా..ఈ సినిమాపై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన రంగస్థల నటుడు నటిస్తున్నాడు.

ఐతే వర్మ చెప్పినట్టు బాలయ్య తెరకెక్కించే సినిమాలో రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాల గురించి..ఎవరికీ తెలియని విషయాలతో పాటు ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు ఎసిపోడ్, లక్ష్మీ పార్వతితో పెళ్లి వంటివి ఉండకపోవచ్చు. అదే తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో మాత్రం ఆ విషయాలే ఉంటాయని  సినిమా ప్రారంభం రోజే చెప్పాడు. లక్ష్మీ పార్వతి..రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయే వరకు ఎన్నో మలుపులున్నాయి. అవన్నీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎలాంటి దాపరికం లేకుండా చూపించబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అందుకే ప్రేక్షకుల ఆదరణ తన సినిమాకే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వర్మ కుండబద్దలు కొడుతున్నాడు. మొత్తానికి బాలయ్య ముఖ్యపాత్రలో నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మిస్ అయిన ఎమోషన్ మహానాయకుడులో కూడా లేకపోతే..బాక్సాఫీప్ దగ్గర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ప్రజలు పట్టం కట్టడం ఖాయం అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఆఫ్ బాలీవుడ్


ఇవి కూడా చదవండి మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు కొత్తగా ఉందే..

రజినీకాంత్ పేటలోకి రాజమౌళి ఎంట్రీ

మరోసారి ఆ స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్..
First published: January 23, 2019, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading