అదేంటి.. క్లోజింగ్ కలెక్షన్స్ అంటే కనీసం కనీసం నాలుగు వారాలు కావాలి కదా.. అప్పుడే ఎండ్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు మహానాయకుడు సినిమా విషయంలో ఇదే జరిగింది. రెండు వారాలకే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇక అవి బయటికి చెప్పకపోవడం మంచిది అనిపిస్తుంది. అంత దారుణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. కనీసం బాలకృష్ణ కలలో కూడా ఊహించలేని విధంగా బోల్తా కొట్టింది మహానాయకుడు. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చూడనటువంటి డిజాస్టర్ మహానాయకుడు.
ఎన్టీఆర్ కథానాయకుడు కనీసం నయం.. దానికి 20 కోట్లైనా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి మాత్రం 5 కోట్లు కూడా రాలేదు. రెండు వారాల్లోనే ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 4.7 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసిందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మహానాయకుడు కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రోడ్డున పడిపోయారు. వాళ్లను ఎవరు ఆదుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ దాదాపు 50 కోట్ల వరకు ఎన్టీఆర్ బయోపిక్ బయ్యర్లను అడ్డంగా ముంచేసింది. దాంతో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలియడం లేదు.
కథానాయకుడు సినిమా 50 కోట్ల నష్టాలు తీసుకొస్తే.. మహానాయకుడు ఉచితంగా ఇస్తానని చెప్పాడు బాలయ్య. కానీ విడుదలకు ముందు చాలా తేడాలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మహానాయకుడు కూడా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బయ్యర్లు ఎటెళ్లాలో తెలియని పరిస్థితి. అసలు వీళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది.
బాలయ్య కూడా ఈ విషయం గురించి ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం కూడా బయ్యర్లను భయపెడుతుంది. ఇప్పుడే వాళ్ల లెక్కలు సెటిల్ చేస్తాడా లేదంటే బోయపాటి సినిమాను ఏదైనా తక్కువ రేట్లకు ఇస్తాడా అనేది ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్.. మహానాయకుడు సినిమాతో బయ్యర్లు మాత్రం దారుణంగా మునిగిపోయారు. మరి డిస్ట్రిబ్యూటర్లను ఎవరు ఎప్పుడు ఎలా ఆదుకుంటారనేది చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Box Office Collections, Krish, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood