అదేంటి.. బాలయ్య ధర్నా చేయడం ఏంటి అనుకుంటున్నారా.. మళ్లీ ఆయనకు కళ్యాణ్ రామ్ సపోర్ట్ చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. మీరు ఊహించేది నిజమే కానీ ఇప్పుడు బాలయ్య నిజంగానే ధర్నా చేస్తున్నాడు. ఈయన ‘మహానాయకుడు’ షూటింగ్ హైదరాబాద్ ఏపిపిఏ మైదానంలో జరుగుతుంది. అక్కడే ‘మహానాయకుడు’ మిగిలిన పార్ట్ షూటింగ్ చేస్తున్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. సినిమాలో అతి ముఖ్యమైన ఘట్టంలో వచ్చే నాదెండ్ల భాస్కరరావ్ ఎపిసోడ్ ఇప్పుడు షూట్ చేస్తున్నాడు క్రిష్.
మరో రెండు రోజుల్లో ‘మహానాయకుడు’ షూటింగ్ కూడా పూర్తి కానుంది. ఇందులో భాగంగానే ఒకటి రెండు కాదు.. ఏకంగా 600 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలయ్యతో పాటు కళ్యాణ్ రామ్, రానా కూడా ఈ షూటింగ్ లో ఉన్నారు. సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని.. కచ్చితంగా ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నాడు దర్శకుడు క్రిష్.
‘కథానాయకుడు’లో ఏవైతే లేవు అని అభిమానులు ఫీల్ అయ్యారో అవన్నీ రెండో భాగంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ఈయన. మరి వీళ్ల నమ్మకం.. బాలయ్య ధర్నా సీన్ సినిమాను ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. ఫిబ్రవరి 14న విడుదల కానుంది మహానాయకుడు. ఈ సినిమాతో కథానాయకుడు నష్టాలను కూడా తీర్చేయాలని చూస్తున్నాడు బాలయ్య. కొందరు బయ్యర్లకు సినిమాను ఉచితంగా కూడా ఇస్తున్నాడు ఈ నిర్మాత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood