NTR Mahanayakudu: బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం.. నాదెండ్ల హెచ్చరికలు.. రేపు ఏం జరగబోతోంది?

NTR Mahanayakudu | కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు చిత్రం ప్రీమియర్ షోలకు కూడా భారీగా డిమాండ్ తగ్గింది.

news18-telugu
Updated: February 21, 2019, 9:28 PM IST
NTR Mahanayakudu: బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం.. నాదెండ్ల హెచ్చరికలు.. రేపు ఏం జరగబోతోంది?
ఎన్టీఆర్ మహానాయకుడు
  • Share this:
(సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం కథానాయకుడు డిజాస్టర్ గా మిగిలిన నేపథ్యంలో ఫుల్ పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన రెండోభాగం మహానాయకుడు ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జనవరిలో రిలీజ్ అయిన కథానాయకుడు మూవీ ఫెయిలైన ఎఫెక్ట్ రెండోభాగంపై అనివార్యంగా పడుతోంది. దీంతో ఫస్ట్ మూవీతో పోలిస్తే సీక్వెల్ కు అభిమానుల్లో అంతగా ఆదరణ కనిపించడం లేదు. గతంలో ఎన్టీఆర్ కుటుంబ హీరోల సినిమాలు సెంచరీలు కొట్టిన పలు థియేటర్ల దగ్గర సందడి కూడా తగ్గింది.ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ప్రవేశించడం, హీరోగా ఎదగడం, అభిమానుల్లో క్రేజ్ సంపాదించడం వరకూ కవర్ చేస్తూ రూపొందిన కథానాయకుడు చిత్రం అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.


దీంతో రెండో భాగంలో పొలిటికల్ అంశాలను ఓ రేంజ్ లో కవర్ చేస్తూ భారీ డైలాగులు కూడా చెప్పించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడం, తర్వాత ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి మరీ అధికారం హస్తగతం చేసుకోవడం వంటి అంశాలను ఇందులో పొందుపర్చినట్టు సమాచారం. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను మాత్రం టచ్ చేయలేదని ఇ‌ప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రోమోలను బట్టి తెలుస్తోంది.

ఎన్‌బీకే ఫిలిమ్స్
ఎన్‌బీకే ఫిలిమ్స్


కథానాయకుడు చిత్రం డిజాస్టర్ అయిన ఎఫెక్ట్ చిత్ర కొనుగోలుదారులపై తీవ్రంగా పడింది. ఏపీలోని కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. తన గత సినిమాలకు భిన్నంగా పేలవమైన కథ, కథనంతో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడనే విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫక్తు రాజకీయ చిత్రంగా తెరకెక్కిన మహానాయకుడు చిత్రంపై భారీ అంచనాలు ఉండడం సహజం. కానీ కథానాయకుడు చిత్రం రిజల్ట్ కొట్టిన దెబ్బతో ఈసారి మహానాయకుడు చిత్రం విషయంలో అభిమానులతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కథానాయకుడు చిత్రం కొని నష్టపోయిన బయ్యర్లకు బాలకృష్ణ కొంత మొత్తం చెల్లిస్తానని చెప్పారు. ఈ చిత్రాన్ని పలుచోట్ల ఫ్రీగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రేట్లు తగ్గించినట్టు సమాచారం.
ఎన్టీఆర్ మహానాయకుడు ప్రివ్యూకి హాజరైన నారా బ్రాహ్మణి


మరోవైపు మహానాయకుడు చిత్రంలో తన పాత్రను నెగెటివ్ గా చూపిస్తే ఊరుకోబోనంటూ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఇప్పటికే ప్రకటించారు. నాదెండ్ల ఎపిసోడ్ ప్రధానంగా చిత్రం తెరకెక్కిన నేపథ్యంలో చిత్రం విడుదల సందర్బంగా అక్కడక్కడా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ టీడీపీతో పోలిస్తే నాదెండ్ల వర్గం అంత బలంగా లేకపోవడాన్ని బట్టి చూస్తే అలాంటి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.

క్రిష్ జాగర్లమూడి, కళ్యాణ్ రామ్


కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు చిత్రం ప్రీమియర్ షోలకు కూడా భారీగా డిమాండ్ తగ్గింది. టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండే కృష్ణా జిల్లాలోనూ పరిమిత ధియేటర్లలోనే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తొలిరోజు టాక్ చూసి ఆ తర్వాత ధియేటర్లను పెంచే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. మహానాయకుడు చిత్రం ఏపీ రాజకీయాలపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపనుందని భావిస్తున్న తరుణంలో ఎన్నికల వేళ ప్రేక్షకులు కూడా చిత్ర విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
First published: February 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>