కథానాయకుడు ఫ్లాప్ తర్వాత మహానాయకుడు సినిమాపై నిజంగానే అంచనాలు తగ్గిపోయాయి. కానీ ఈ చిత్రంతో కచ్చితంగా తానేంటో చూపిస్తానంటున్నాడు బాలయ్య. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఒక్క రోజు ముందే ఈ చిత్ర ప్రీమియర్ షో కూడా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 21 సాయంత్రం మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్‌లో ఈ చిత్ర షో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.
సినిమా అంతా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నందమూరి బాలకృష్ణ NBK ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నిర్మించారు. సినిమా సెన్సార్ రివ్యూ ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చింది. దానికితోడు కేవలం 2 గంటల 8 నిమిషాల రన్ టైమ్ ఉండటం సినిమాకు కలిసొస్తుంది.
కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు క్రిష్. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా ఎలా ముగస్తుందనే విషయంపై చాలా ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. అయితే క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా బసవతారకం చనిపోవడంతో ముగిసిపోనుంది. లక్ష్మీ పార్వతి అనే టాపిక్ ఇందులో కనిపించదు. అంటే కథ 80ల్లోనే ఆగిపోతుంది.. కనీసం 90ల్లోకి కూడా రాదని తెలుస్తుంది. అయితే దీన్నే చాలా ఎమోషనల్ సీన్స్ తో క్రిష్ రక్తి కట్టించాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. మహానాయకుడు సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, NTR Biopic, NTR Mahanayakudu, NTR Mahanaykudu Movie Review, Rana, Telugu Cinema, Tollywood