‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ.. ఎన్టీఆర్‌లో రాజకీయ కోణం..

NTR Mahanayakudu Movie Review | కథానాయకుడు ఫ్లాప్ కావడంతో మహానాయకుడుపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. నందమూరి అభిమానులు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే మహానాయ‌కుడు చిత్రాన్ని తెరకెక్కించాడు క్రిష్.. మరి అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 22, 2019, 11:31 AM IST
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ.. ఎన్టీఆర్‌లో రాజకీయ కోణం..
మహానాయకుడు పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 22, 2019, 11:31 AM IST
రివ్యూ: ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు
రేటింగ్: 3/5
న‌టీన‌టులు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్, క‌ళ్యాణ్ రామ్, స‌చిన్ ఖేడ్ ఖ‌ర్ త‌దిత‌రులు

ఎడిటర్: అర్రం రామకృష్ణ
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
సంగీతం: ఎంఎం కీరవాణి


క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: క‌్రిష్
Loading...
నిర్మాత‌: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌

కథానాయకుడు ఫ్లాప్ కావడంతో మహానాయకుడుపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. నందమూరి అభిమానులు వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే మహానాయ‌కుడు చిత్రాన్ని తెరకెక్కించాడు క్రిష్.. మరి అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

క‌థ‌:
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తాడు. ప్రజా సంక్షేమమే తన పథకాలు అంటూ జనాల్లోకి వెళ్లిపోతాడు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఢిల్లీ గద్దెను సైతం సడలించి.. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలబెడతాడు. కానీ ఆ తర్వాత భార్య అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లడంతో ఇక్కడ ఉన్న నాదెండ్ల భాస్కరరావు.. ఎన్టీఆర్ ను సీఎం కుర్చీ దించేస్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తన సీఎం కుర్చీని ఎలా దక్కించుకున్నాడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నినదించాడు అనేది కథ..

క‌థ‌నం:
కథానాయకుడు మీద ఉన్న ప్రధాన విమర్శ ఎన్టీఆర్ భజన ఎక్కువగా చేశారు అని.. అందుకే ఆ చిత్రం డిజాస్టర్ అయిపోయింది అని.. దాంతో క్రిష్ ఈ సారి కాస్త జాగ్రత్తలు తీసుకున్నాడు. మహానాయకుడు సినిమాలో అలాంటి జోలికి వెళ్లకుండా కేవలం వాస్తవాలు చూపించే ప్రయత్నం చేశాడు. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు క్రిష్. తొలిపాటలోనే ఎన్టీఆర్ బాల్యంతో పాటు వివాహాన్ని కూడా చూపించాడు. ఆ తర్వాత నేరుగా తొలి భాగాన్ని మొత్తం కేవలం రెండు గంట‌ల్లో 8 నిమిషాల్లో చెప్పేసాడు. ఇక ఆ తర్వాత చైతన్యరథం తీసుకొని జనాల్లోకి వెళ్లడం అన్నగారి ప్రపంచంలో ఆయనకున్న అభిమానం అన్నీ కలిపి చూపించేసాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఆ పదవి కోసం వేచి చూసేలా చూడటం.. వెనకాల రాజకీయాలు చేయడం ఇవన్నీ బాగా ఆవిష్కరించాడు క్రిష్. చంద్రబాబు పాత్ర ఇందులో కీలకం.
ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని అప్పట్లో ముందుండి నడిపించినట్లు చంద్రబాబు పాత్రను చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు వైపు వెళ్తున్నప్పుడు సముదాయించి.. ఎన్టీఆర్ వైపు ఉండేలా చేయడంలో బాబు పాత్ర కీలకంగా ఉందని ఈ చిత్రంలో చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం నాదెండ్ల భాస్కరరావు చేసే రాజకీయాలు.. ఢిల్లీ వెళ్లి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టడం.. ఈ రెండు ఘ‌ట్టాల‌తోనే ముగించాడు. దానికి తోడు భార్య బసవతారకంతో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అయితే ఎంత చేసినా కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు అసంపూర్తిగానే అనిపించింది. ఇది కూడా కమర్షియల్ గా ఎటు వెళుతుందో తెలియదు కానీ ఒక మంచి సినిమాగా మాత్రం మిగిలిపోతుంది. పూర్తిగా బ‌స‌వ‌తారకం కోణంలోనే సినిమా సాగుతుంది.

న‌టీన‌టులు:
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో అచ్చుగుద్దినట్లు సరిపోయాడు. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వచ్చే పాత్ర కావడంతో తండ్రి పోలికలతో కనిపించాడు. విద్యాబాలన్ చాలా బాగా నటించింది. నాదెండ్ల భాస్కర రావు పాత్రలో అద్భుతంగా నటించాడు స‌చిన్ ఖేడ్ ఖ‌ర్. మిగిలిన అన్ని పాత్రలు అద్భుతంగా సరిపోయారు. క‌ళ్యాణ్ రామ్ బాగున్నాడు. ఇక రానా మ‌రో హీరోగా క‌నిపించాడు ఈ సినిమాలో. చంద్ర‌బాబు పాత్ర‌లో ఆయ‌న ప్రాణం పెట్టి న‌టించాడు.

టెక్నిక‌ల్ టీం:
క‌థానాయ‌కుడుతో పోలిస్తే కీర‌వాణి ఈ సినిమాకు అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాట‌లు కూడా బాగున్నాయి. ఎడిట‌ర్ ఈ సారి సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా ప‌ని చేసాడు. ఎందుకంటే కేవలం రెండు గంట‌ల్లో సినిమాను ముగించాడు. ఇక సినిమాటోగ్ర‌ఫ‌ర్ ప‌నితీరు కూడా బాగుంది. ఇక ద‌ర్శ‌కుడిగా క్రిష్ ఈ సారి ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. అయితే అసంపూర్తిగా ముగించేసాడేమో అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఉన్న ప్ర‌ధాన ఘ‌ట్టాల్లో ఒక‌టి మాత్ర‌మే చూపించాడు. మ‌రి అది ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు న‌చ్చుతుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మే.

చివ‌ర‌గా ఒక్కమాట:
ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు.. ఫుల్ ఆఫ్ పాలిటిక్స్..

 
First published: February 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...