రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ గుండుతో కనిపిస్తారా..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న  సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు.

news18-telugu
Updated: January 4, 2020, 9:55 AM IST
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ గుండుతో కనిపిస్తారా..
Twitter/RRRMovie
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న  సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. కాగా రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర, ఆయన లుక్ గురించి ఓ ఆ సక్తికర రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఉద్యమకారుడు కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. అయితే విషయం ఏమంటే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ గుండుతో కనిపిస్తారని టాక్. ఇది వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ చరిత్ర రీత్యా కొమరం భీమ్ తలపాగా ధరించి ఉన్నారు. ఇటీవల లీకైన లుక్ లో కూడా ఎన్టీఆర్ తలపాగాతో కనిపించారు. దీనికితోడు రాజమౌళి చారిత్రక పాత్రలను కొంత కల్పితం జోడించి ఈ మూవీ చేస్తున్నానని చెప్పిన తరుణంలో ఈ వాదనలను కొట్టిపారేయలేం. అయితే  ఈ విషయంపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకు వేచి వుండాల్సిందే.


చీరలో చంపేసిన పునర్నవి... అదిరిన లేటెస్ట్ పిక్స్..


First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు