NTR : ఎన్టీఆర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్.. కీలకపాత్రలో విజయశాంతి...

ఎన్టీఆర్ రాజమౌళి Photo : Twitter

NTR | Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో వస్తున్న ఈ సినిమాను మొదట త్రివిక్రమ్‌తో చేయాల్సి ఉంది. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ముందుకు సాగలేదు. దీంతో ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల శివతో ప్లాన్ చేశారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్’ విజయశాంతి నటిస్తున్నట్లు సమాచారం. విజయశాంతి చాలా గ్యాప్ తరువాత అంటే దాదాపు 13 ఏళ్ల తరువాత మహేష్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విజయశాంతి మరోసారి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌పుల్‌గా ఉంటుందట. ఇక మరోవైపు వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుంది. అందుకే కొరటాల ఈ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తి కావోచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌ను కొన్ని రోజులు వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల మధ్య విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను చేయనున్నాడు. గతంలో కొరటాల శివ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజి సినిమా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

    ఇక ఈ సినిమా కూడా మేసేజ్ ఒరియేంటెడ్‌గా వస్తోందట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌‌గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు కొరటాల శివ.

    NTR 30 - Koratala Siva Movie Latest Update This is Made on Different Political Back Drop Here Are The Details,NTR 30 - Koratala Siva: అదిరిపోయే బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ..,NTR 30 - Koratala Siva,NTR 30,Koratala Siva,NTR RRR,Jr NTR,Jr Roudram Ranam Rudhiram,NTR Koratala Siva Different Political Back Drop Movie,jr ntr,jr ntr twitter,jr ntr koratala siva movie,jr ntr koratala siva movie ntr 30,jr ntr koratala siva movie ntr arts,koratala siva acharya movie,ntr 30 trivikram,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా
    NTR and Koratala Siva Photo : Twitter


    ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    Chiranjeevi Lucifer remake,Chiranjeevi Lucifer remake actress,Chiranjeevi Lucifer remake trisha,Chiranjeevi Lucifer remake nayanthara,Chiranjeevi Lucifer remake trisha sister,Chiranjeevi Lucifer remake heroine,Chiranjeevi Lucifer remake title,Chiranjeevi Lucifer remake shooting,చిరంజీవి,చిరంజీవి లూసీఫర్ రీమేక్,చిరంజీవి త్రిష లూసీఫర్ రీమేక్,చిరంజీవి చెల్లిగా త్రిష
    చిరంజీవి,విజయశాంతి (Chiranjeevi Vijayashanti)


    ఇక మరోవైపు ఎన్టీఆర్ జెమిని టీవీలో ఓ గేమ్ షో చేస్తున్నాడు. గ‌తంలో ఇదే షోను నాగార్జున‌, చిరంజీవి 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమా తర్వాత ఆయన సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా ఉండనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
    Published by:Suresh Rachamalla
    First published: